Gautham : తాత మరణంపై గౌతమ్ ఎమోషనల్ పోస్ట్..
టాలీవుడ్ డాషింగ్ అండ్ డేరింగ్ హీరో కృష్ణ మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఘట్టమనేని ఫ్యామిలీ అయితే కుటుంబంలో వరుస మరణాలకు కృంగిపోతుంది. బుధవారం అధికార లాంఛనాలు మధ్య కృష్ణ అంత్యక్రియలు ముగిసాయి. అయితే తాత మరణాన్ని తట్టుకోలేని మనవడు గౌతమ్, మనవరాలు సితార.. తమ సోషల్ మీడియాలో తాతయ్య కృష్ణ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ పోస్టులు వేశారు. గౌతమ్..

Gautham and Sitara Emotional posts on Krishna
Gautham : టాలీవుడ్ డాషింగ్ అండ్ డేరింగ్ హీరో కృష్ణ మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఘట్టమనేని ఫ్యామిలీ అయితే కుటుంబంలో వరుస మరణాలకు కృంగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన కృష్ణ మంగళవారం తుది శ్వాస విడిచాడు. బుధవారం అధికార లాంఛనాలు మధ్య కృష్ణ అంత్యక్రియలు ముగిసాయి.
Superstar Krishna Last Rites Completed: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తి
అయితే తాత మరణాన్ని తట్టుకోలేని మనవడు గౌతమ్, మనవరాలు సితార.. తమ సోషల్ మీడియాలో తాతయ్య కృష్ణ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ పోస్టులు వేశారు. గౌతమ్.. “నువ్వు ఎక్కడ ఉన్నా, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. అలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తుంటావని నాకు తెలుసు. నేను చెప్పలేనంతగా మిమ్మల్ని మిస్ అవుతున్న, మిస్ యూ తాత గారూ” అంటూ కృష్ణతో ఉన్న ఫోటోని షేర్ చేశాడు.
అలాగే సితార.. “వీకెండ్స్ లో లంచ్ మళ్ళీ ఎప్పటిలా ఉండదు. నువ్వు నాకు చాలా విలువైన విషయాలు నేర్పావు. ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నావు. ఇప్పుడు మిగిలింది నీ జ్ఞాపకం మాత్రమే. నువ్వే నా హీరో. ఏదో ఒక రోజు నిన్ను గర్వపడేలా చేయగలనని ఆశిస్తున్నాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తాత గారూ” అంటూ పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజెన్లు ఎమోషనల్ అవుతున్నారు.