Gopichand : హీరోయిన్ కోసం దర్శకుడిని కాదన్న గోపీచంద్.. ఇంటర్వ్యూలో నిలదీసిన దర్శకుడు..

హీరోయిన్ కోసం తనకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తేజతో గోపీచంద్ సినిమా వద్దు అనుకున్నాడు. ఆ విషయాన్ని తేజ కెమెరా ముందు నిలదీశాడు.

Gopichand : హీరోయిన్ కోసం దర్శకుడిని కాదన్న గోపీచంద్.. ఇంటర్వ్యూలో నిలదీసిన దర్శకుడు..

Gopichand director teja interview Ramabanam promotions

Updated On : April 29, 2023 / 3:45 PM IST

Gopichand : మ్యాచో స్టార్ గోపీచంద్ రామబాణం (Ramabanam) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవాసు డైరెక్ట్ చేస్తున్నాడు. డింపుల్ హయాతి (Dimple Hayathi) హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు, నాజర్, కుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మే 5న రిలీజ్ కి సిద్దమవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే గోపీచంద్ డైరెక్టర్ తేజతో ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో గోపీచంద్ ని తేజ్ గతంలో జరిగిన ఒక విషయం గురించి నిలదీశాడు.

Ramabanam : వివాదంలో రామబాణం సినిమా సాంగ్.. ఆ పాట నాదే అంటూ జానపద గాయకుడు..

హీరోగా మొదటి సినిమా ఫెయిల్ అవ్వడంతో గోపీచంద్ కి మరో సినిమా అవకాశం రాలేదు. అలాంటి సమయంలో తేజ గోపీచంద్ కి పిలిచి మరి జయం సినిమాలో విలన్ అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత గోపీచంద్ హీరోగా ఒక సినిమా చేసేందుకు తేజ కథ సిద్ధం చేశాడు. గోపీచంద్ కూడా ఒకే చెప్పాడట. కానీ కథకు తగట్టు హీరోయిన్ దొరకలేదు అంటా. ఆ విషయాన్ని గోపీచంద్ కి చెప్పడానికి ఫోన్ చేస్తే తను కావాలనే లిఫ్ట్ చేయలేదట. ఆ విషయాన్ని ఇప్పుడు ఇంటర్వ్యూలో ప్రశ్నించగా గోపిచంద్ బదులిస్తూ.. దానికి ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాను అంటూ బదులిచ్చాడు.

Gopichand : మీ తండ్రిని చూసి అవకాశం ఇచ్చా.. నువ్వేం పీకావ్.. గోపీచంద్ పై తేజ కామెంట్స్!

గోపీచంద్ వివరిస్తూ.. “ఆ రోజు జరిగింది నాకు ఇప్పటికీ గుర్తుంది. మీరు ఫోన్ చేసినప్పుడు నేను జిమ్ లో ఉన్నాను. ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే మీరు నన్ను ఏమి అడుగుతారో కూడా నాకు తెలుసు. నీకు నేను ముఖ్యమా హీరోయిన్‌ ముఖ్యమా? అని అడుగుతారు. వ్యక్తిగతంగా నేను మీరే ముఖ్యం అంటాను. కానీ మీరు చెప్పిన కథకి హీరోయిన్ ఎంతో ముఖ్యం. ఆ పాత్రకు తగ్గ హీరోయిన్ లేకపోతే సినిమా మొత్తాన్ని నేను ఒకడినే నడపలేను. దీంతో మీకు ఏ సమాధానం చెప్పాలో తెలియక ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దానికి ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.