Tollywood : స్టార్ హీరోలపై డైరెక్ట‌ర్లు అలిగారు ?

ఈ మధ్య టాప్ హీరోలంతా కన్నడ, తమిళ్‌ డైరెక్టర్లతో పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. ఇదే టాలీవుడ్ (Tollywood) దర్శకులకు కాస్త కంటిగింపుగా మారిందట.

Tollywood : స్టార్ హీరోలపై డైరెక్ట‌ర్లు అలిగారు ?

The directors are upset with the star heroes

Updated On : January 23, 2026 / 4:01 PM IST

Tollywood : సినిమా అంటేనే సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పైగా సెంటిమెంట్‌ కూడా ప్రయారిటీగా మారుతోంది. అయితే ఈ మధ్య టాప్ హీరోలంతా కన్నడ, తమిళ్‌ డైరెక్టర్లతో పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. ఇదే టాలీవుడ్ దర్శకులకు కాస్త కంటిగింపుగా మారిందట. తాము మంచి హిట్స్ ఇస్తున్నా, టాప్ హీరోలు.. తమిళ్, కన్నడ డైరెక్టర్లతో పాన్ ఇండియా సినిమాలు కమిట్ అవడంపై టాలీవుడ్‌ డైరెక్టర్లు ఫీల్ అవుతున్నారట.

అట్లీతో అల్లు అర్జున్‌ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్‌తో సలార్ మూవీ చేశాడు. ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్ మూవీని తెరకెక్కిస్తుండగా.. డైరెక్టర్‌ నెల్సన్‌తో ఎన్టీఆర్‌ సినిమా అంటూ టాక్స్‌లో నడుస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్‌తో కొత్త ప్రాజెక్ట్ అంటూ ఓ ప్రచారం ఉంది. ఇదే టాలీవుడ్ డైరెక్టర్లలో అసంతృప్తికి దారి తీస్తోందట. మన హీరోలు మనకు వ్యాల్యూ ఇవ్వట్లేదన్న ఫీల్ అయిపోతున్నారట.

Mrunal Thakur : యువ హీరోతో క్లోజ్ గా మృణాల్ ఠాకూర్.. ఫొటోలు వైరల్.. ఏంటి సంగతి..

తమిళ్, కన్నడ డైరెక్టర్లు హవా అనడానికి ప్రశాంత్ నీల్, లోకేశ్‌ కనగరాజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు. ప్రశాంత్ నీల్ ఇప్పుడు NTRతో ‘డ్రాగన్’ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. అది తెలుగు మార్కెట్‌ను ఫోకస్ చేసిన ప్రాజెక్ట్‌గా చెబుతున్నారు. అలాగే లోకేశ్‌ కనగరాజ్.. అల్లు అర్జున్‌తో హైదరాబాద్‌లో షూట్ చేసే తెలుగు ఫిల్మ్‌కు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ ఔట్‌ సైడ్‌ డైరెక్టర్ల ఆధిపత్యం టాలీవుడ్ సొంత డైరెక్టర్లకు కొంత టెన్షన్ కలిగిస్తోందట.

కానీ హీరోలు కొత్త ఎక్స్‌పీరియన్స్ కోసం ఇలాంటి కాంబినేషన్స్‌ను ప్రిఫర్ చేస్తున్నారన్న టాక్ ఉంది. మరోవైపు సక్సెస్‌ ఫుల్ డైరెక్టర్స్ తాము హిట్స్ ఇస్తున్న టాప్ హీరోలు పట్టించుకోకపోవటంతో తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోలేకపోతున్నామనే బాధ పడిపోతున్నారట.