Gunasundari Katha : గుణసుందరి కథ టీజర్ చూశారా..? మరో సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతుంది..
గుణసుందరి కథ సినిమా టీజర్ విడుదలయింది. ప్రస్తుత సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని అంతర్లీనంగా టచ్ చేస్తూ రియాలిస్టిక్ అప్రోచ్ తో యువతను ఇంకా ఫ్యామిలీని ఆకట్టుకునే థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా.

Gunasundari Katha teaser released
Gunasundari Katha : మార్త క్రియేషన్స్ బ్యానర్ ఫై ఓం ప్రకాష్ మార్త నిర్మాణ దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం గుణసుందరి కథ. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలయింది. ప్రస్తుత సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని అంతర్లీనంగా టచ్ చేస్తూ రియాలిస్టిక్ అప్రోచ్ తో యువతను ఇంకా ఫ్యామిలీని ఆకట్టుకునే థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా.
మహిళా ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుందనీ ఆలోచింపజేస్తుందని చిత్రం యూనిట్ విశ్వసిస్తోంది. మంచి కథ ను చెప్పాలనే ప్రయత్నంతో రాబోతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని, సపోర్ట్ చేయాలనీ చిత్రం యూనిట్ కోరుకుంటున్నాను. సునీత సద్గురు, ఆనంద చక్రపాణి, కార్తీక్ సాహస్, రేవంత్ త్రిలోక్.. పలువురు ముఖ్యపాత్రలు పోషించగా తెలంగాణ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కవి సిద్ధార్థ ఈ సినిమాకు కథ నడిచారు.