చిన్నప్పుడు నిక్కర్లేసుకుని తిరిగేదానివి : హ్యాపీ బర్త్‌డే రాశీ ఖన్నా
రాశీ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ టీజర్ రిలీజ్ చేశారు ‘వెంకీ మామ’ టీమ్..

రాశీ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ టీజర్ రిలీజ్ చేశారు ‘వెంకీ మామ’ టీమ్..
రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య రీల్ లైఫ్ మామాఅల్లుళ్లుగా నటిస్తున్న సినిమా.. ‘వెంకీ మామ’.. వెంకీతో పాయల్ రాజ్‌పుత్, చైతుతో రాశీఖన్నా జతకడుతున్నారు.
నవంబర్ 30న రాశీ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ టీజర్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. ‘నీతో ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఊహించుకున్నాను’ అంటూ రాశీ ఖన్నా చైతుతో చెప్పే డైలాగ్ ఎమోషనల్‌గా అనిపిస్తే..
‘ఎప్పుడో చిన్నప్పుడు చూశాను.. చిన్నచిన్న నిక్కర్లేసుకుని తిరిగేదానివి’ అని వెంకీ రాశీ ఖన్నాని ఉద్దేశించి అనగానే పక్కనే ఉన్న విద్యుల్లేఖ రాశీ స్కర్ట్ కిందకిలాగడం ఫన్నీగా అనిపిస్తుంది. వీడియో చివరిలో చైతు రాశీకి ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ‘వెంకీమామ’ విడుదల తేది ప్రకటించనున్నారు.