Unstoppable: ఉదయాన్నే హెరిటేజ్.. సాయంత్రం మ్యాన్షన్ హౌస్.. బాలయ్యా నీ టైమింగ్ కేకయ్యా!
తెలుగులో ఇప్పటివరకు పలువురు యంగ్ హీరోలు, కొందరు హీరోయిన్లు హాస్ట్‌లుగా ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించగా.. అదే బాటలోకి సీనియర్ హీరో బాలకృష్ణ వస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు.

Unstoppable
Unstoppable: తెలుగులో ఇప్పటివరకు పలువురు యంగ్ హీరోలు, కొందరు హీరోయిన్లు హాస్ట్‌లుగా ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించగా.. అదే బాటలోకి సీనియర్ హీరో బాలకృష్ణ వస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఆఫ్ స్క్రీన్ బాలయ్య చాలా సరదాగా ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే అయినా.. హోస్టింగ్ మాత్రం ఎలా చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అన్ స్టాపబుల్ షోతో బాలయ్య యాక్టింగ్‌లోనే కాదు హోస్టింగ్‌లో కూడా సూపర్ హిట్ అని తేలిపోయింది.
Lady Villains: నెగెటివ్ రోల్స్‌కి సై అంటున్న అందమైన భామలు!
వచ్చిన గెస్ట్ ని బట్టి బాలయ్య తనలో యాంగిల్స్ మారుస్తూ షోను సరదాగా నడిపించడం అభిమానులను, ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ముఖ్యంగా బాలయ్య తనలో ప్రేక్షకులకు తెలియని కామెడీ టైమింగ్ కూడా ఉందని నిరూపించింది అన్ స్టాపబుల్ షో. ఇప్పటికే బాలయ్య టైమింగ్ కోసమే ఈ షో చూసిన వాళ్ళు ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో స్పష్టం కాగా ఇప్పుడు అన్ స్టాపబుల్ నుండి వచ్చిన ఓ ప్రోమో మరోసారి ఇదే విషయాన్ని ప్రూవ్ చేసింది.
Chiranjeevi: మెగాస్టార్ కండీషన్స్ అప్లై.. సర్ ప్రైజింగ్ గెస్ట్స్ ఉండాల్సిందే!
టాలీవుడ్ హాంక్ రానాతో బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ చేశాడు. ఇప్పటికే ఈ షో ఆహాలో అందుబాటులో సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండగా యూట్యూబ్ లో ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ప్రోమోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా ఆదివారం రిలీజ్ చేసిన ప్రోమో మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఇందులో బాలయ్య రానాకు రెండు గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారు. ఒకటి మాన్షన్ హౌస్ గిఫ్ట్ కాగా.. మరొకరి హెరిటేజ్ గిఫ్ట్.
Oscar 2022: ఆస్కార్ బరిలో జేమ్స్ బాండ్.. 4 విభాగాలకు నామినేట్!
ఈ రెండిటికి ఏమన్నా సంబంధం ఉండగా సార్ రానా జోక్ చేస్తే బాలయ్య అదిరిపోయే టైమింగ్ తో ఒకటి పొద్దున్నే.. మరొకటి రాత్రికి అంటూ కౌంటర్ వేశారు. బాలయ్య స్పాంటినిటీ టైమింగ్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. బాలయ్యా నీ టైమింగ్ కేకయ్యా అంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
https://www.youtube.com/watch?v=hBFLTaYcbds