Jiiva : వైఎస్ జగన్ లాగే కనిపించడానికి రీసెర్చ్ చేశాను.. ప్రతిపక్షం నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయా అని మమ్ముట్టి గారిని అడిగితే..

యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ కి హీరో జీవా కూడా వచ్చారు.

Jiiva : వైఎస్ జగన్ లాగే కనిపించడానికి రీసెర్చ్ చేశాను.. ప్రతిపక్షం నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయా అని మమ్ముట్టి గారిని అడిగితే..

Hero Jiiva Speaks about YS Jagan in Yatra 2 Movie Promotional Press Meet

Updated On : February 6, 2024 / 5:17 PM IST

Jiiva : వైఎస్సార్(YSR) బయోపిక్ గా దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా యాత్ర 2(Yatra 2) రాబోతుంది. యాత్రలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించగా అదే పాత్రని కంటిన్యూ చేస్తూ వైఎస్ జగన్(YS Jagan) బయోపిక్ గా యాత్ర 2 తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేశారు.

యాత్ర 2 సినిమాని తండ్రి కొడుకుల ఎమోషన్ తో తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ కి హీరో జీవా కూడా వచ్చారు.

Also Read : They Call Him OG : కొత్త పోస్టర్‌తో OG రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్.. ఎలక్షన్స్ అయ్యాకే..

యాత్ర 2 సినిమా ప్రెస్ మీట్ లో జీవా మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గారి పాత్రలో నటించడం చాలా కష్టంగా అనిపించింది. ఆయనకు సంబంధించిన వీడియోలు రోజూ చూస్తుండేవాడిని. ఆయన ఎలా మాట్లాడతారు, ఎలా నడుస్తారు, ఎలా ఉంటారు.. ఇలా అన్నిటి గురించి రెండు మూడు నెలలు చాలా రీసెర్చ్ చేశాను. జగన్ గారిని డైరెక్ట్ గా కలవలేదు. షూటింగ్ లో డైరెక్టర్ షాట్‌కి ఓకే చెప్తేనే నాకు రిలీఫ్ గా ఉండేది. డైరెక్టర్ మహి ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఈ పాత్రకు నన్ను ఓకే చేయడానికే చాలా టైం తీసుకున్నారు. నేను జగన్ మోహన్ రెడ్డి గారిలా కనిపిస్తున్నాను అని అర్ధం అయ్యాక మానిటర్ కూడా చూడలేదు. యాత్రలో మమ్ముట్టి గారు చేశారు కాబట్టి సినిమా మొదట్లోనే ప్రతిపక్షం నుంచి ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా అని మమ్ముట్టి గారిని అడిగాను. మనం యాక్టర్స్, ఇది క్రియేటివ్ స్పేస్.. కేవలం సినిమాగానే చూడు అని చెప్పారు. కొన్ని సీన్స్, సాంగ్స్ తీసేటప్పుడు నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను అని తెలిపారు.