Nikhil Siddhartha : యుద్ధం కత్తితో కేక్ కోస్తున్న నిఖిల్.. పక్కనే నభా నటేష్..
వైవిథ్యభరిమైన చిత్రాలను చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్.

Nikhil Birthday Celebrations
Nikhil Siddhartha Birthday Celebrations : వైవిథ్యభరిమైన చిత్రాలను చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం స్వయంభు. జూన్ 1న ఆయన పుట్టిన రోజు. దీంతో స్వయంభు షూటింగ్ స్పాట్‌లో చిత్ర బృందం నిఖిల్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించింది. యుద్ధం చేసే పెద్ద కత్తితో నిఖిల్ కేక్‌ను కట్ చేశాడు. చిత్ర బృందం మొత్తం ఈ వేడుకల్లో పాల్గొంది. ఆయన పక్కనే హీరోయిన్ నభా నటేష్ సైతం ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక స్వయంభు చిత్ర విషయానికి వస్తే.. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. సంయుక్త, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో నిర్మాణంలో భువన్, శంకర్ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ తో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
Nivetha Pethuraj : నివేదా పేతురాజ్ ‘పరువు’ ట్రైలర్.. ఆసక్తికరంగా..