Horror Movie Actress : నటనకు గుడ్ బై చెప్పి సన్యాసినిగా మారిన హీరోయిన్

పేరు, కీర్తి, డబ్బు లేదా గుర్తింపు ఇవేమీ ఆ నటికి సంతృప్తి ఇవ్వలేదు. బౌద్ధమతాన్ని స్వీకరించి సన్యాసినిగా మారిపోయారు. ఎవరా నటి?

Horror Movie Actress : నటనకు గుడ్ బై చెప్పి సన్యాసినిగా మారిన హీరోయిన్

Horror Movie Actress

Updated On : February 6, 2024 / 1:38 PM IST

Horror Movie Actress : మోడల్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు. సడెన్‌గా ఆ నటి సన్యాసినిగా మారిపోయారు.. ఎవరా నటి? ఏమైంది?

Malvi Malhotra : ఆ నిర్మాత నన్ను మోసం చేసారు.. నటి సంచలన ఆరోపణలు

బర్ఖా మదన్.. ఒకప్పుడు పేరున్న మోడల్. 1994 లో మిస్ ఇండియా ఫైనలిస్టు. అందాల కిరీటం కోసం సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్‌లతో కూడా పోటీ పడి మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నరప్‌గా నిలిచారు. 1996 లో ‘ఖిలాడీ కా ఖిలాడీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2003 లో రామ్ గోపాల్ వర్మ ‘భూత్’ సినిమాలో కనిపించారు. దెయ్యం పాత్రలో భయపెట్టడమే కాదు మంచి పేరు సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరో వైపు సీరియల్స్‌లో కూడా నటించిన బర్ఖా అకస్మాత్తుగా సన్యాసినిగా మారిపోయారు.

Nimisha Sajayan : పంటపొలాల్లో చీరకట్టుతో నిమిషా సజయన్ చిరునవ్వులు..

బర్ఖా మదన్ పేరు ఇప్పుడు ‘గ్యాల్టెన్ సామ్టెన్’. పర్వతాలు, ఆశ్రమాలలో తిరుగుతూ కనిపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తన ఆధ్యాత్మిక అంశాలనే పోస్టు చేస్తున్నారు బర్ఖా మదన్. దలైలామా ఫాలోవర్‌‌గా ఉన్న బర్ఖా.. 2012 లోనే బౌద్ధమతాన్ని స్వీకరించాలని అనుకున్నారట. ప్రస్తుతం ధ్యానం, ప్రార్థనలు, ప్రజలకు సేవలతో బర్భా జీవితం నిండిపోయింది. మోడల్‌గా, నటిగా, నిర్మాతగా కూడా ఉన్న బర్ఖా సన్యాసినిగా మారడం వెనుక బలమైన కారణాలు ఉండి ఉండవచ్చును.

 

View this post on Instagram

 

A post shared by Barkha Madan (@barkhamadan17)