I Bomma : ఐ బొమ్మ పైరసీ జుజుబీ.. అసలు కథ వేరే.. వామ్మో రవి ఇంత చేశాడా?
పోలీసుల విచారణలో ఐ బొమ్మ సైట్ గురించి, రవి గురించి సంచలన విషయాలు తెలిసాయి. (I Bomma)
I Bomma
I Bomma : సినిమాలను పైరసీ చేసి ఐ బొమ్మ వెబ్ సైట్ ప్రతినిధి రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవి పోలీసుల రిమాండ్ లో చంచల్ గూడా జైలులో ఉన్నాడు. అయితే పోలీసుల విచారణలో ఐ బొమ్మ సైట్ గురించి, రవి గురించి సంచలన విషయాలు తెలిసాయి. జైలులో రవిని కలవడానికి అతని కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. అతని ఫ్రెండ్ పంపించే లాయర్ కోసం రవి ఎదురుచూస్తున్నాడట.(I Bomma)
పోలీసుల సమాచారం ప్రకారం.. రవి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతనికి నెలకు లక్ష రూపాయల వరకు జీతం వచ్చేది. కానీ ఆ డబ్బు సరిపోయేది కాదంట. భార్య, అత్తమామలు కూడా డబ్బు సంపాదించట్లేదని హేళన చేసారంట. దీంతో డబ్బు సంపాదన లక్ష్యంగా ఈ పైరసీలోకి వచ్చాడట. అమెరికాలో ఒక డొమైన్, ఇక్కడ అమీర్ పెట్ లో ఒక డొమైన్ రిజిస్టర్ చేయించి కథ మొదలుపెట్టాడు. ఈ పైరసీ సైట్స్ తో అతనికి విదేశాల్లో కూడా కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, హవాలా, క్రిప్టో కరెన్సీ లాంటివి కూడా నడిపించాడట. ఐ బొమ్మలోపైరసీ సినిమాల నుంచి వచ్చేది కేవలం 20 శాతం ఆదాయం మాత్రమే. కానీ ఐ బొమ్మకు వచ్చే యూజర్స్ ని బెట్టింగ్ యాప్స్ కి మళ్లించడం ద్వారా 80 శాతం భారీ ఆదాయం వచ్చేది అని తెలిసింది. అతని దగ్గర ఇప్పటికే 20 కోట్ల వరకు ఉన్నట్టు, అందులో 3.5 కోట్లు సీజ్ చేసినట్టు ఇటీవల పోలీసులు తెలిపారు.
ఈ డబ్బంతా రవి హవాలా, క్రిప్టో కరెన్సీ రోపంలో విదేశాలకు తరలించాడట. అలాగే ఈ నెట్ వర్క్ లో పలువురు విదేశీయలు కూడా ఉండటంతో వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. అయితే రవికి విదేశీ పౌరసత్వం ఉండటంతో అతను తప్పించుకొని పారిపోయే ప్రమాదం ఉందని, ఆధారాలను నాశనం చేసే అవకాశం ఉందని అందుకే పోలీసులు అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారట. ఈ ఐ బొమ్మ కేసు కాస్తా బెట్టింగ్, హవాలా, క్రిప్టోకి మారడంతో ఈడీ అధికారులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
దీంతో రవి గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలే బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్స్ తో చాలా మంది మోసపోయి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. జనాలకు ఫ్రీగా సినిమాలు అనే ఆశ చూపించి బెట్టింగ్ వైపు వాళ్ళని మళ్లించి రవి క్యాష్ చేసుకుంటున్నాడు అని సమాచారం. అలాగే యూజర్స్ ప్రైవేట్ డేటా కూడా సేకరించి డార్క్ వెబ్ కి అమ్మే పనిలో కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఇన్నాళ్లు ఇతన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. ఫ్రీగా సినిమాలు అంటూ వచ్చే సైట్స్ చూసి అందులో లింక్స్ క్లిక్ చేసి మోసపోవద్దు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నారు.
Also Read : Chiranjeevi : చరణ్ ఆ సినిమా చూపిస్తే కానీ అన్నం తినేవాడు కాదు.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..
