Pawan Kalyan : ఇది కదా పవన్ అంటే.. తప్పుచేస్తే ఫ్యాన్స్ అయినా, జనసైనికులు అయినా చర్యలు తీసుకుంటామని పోస్ట్..

ఇటీవల సోషల్ మీడియాని ఉపయోగించుకొని తప్పుడు పోస్టులు, కుటుంబాలను, మహిళలను కించపరుతూ పోస్టులు చేసే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని పవన్ ఓ బహిరంగ సభలో అన్నారు.

Pawan Kalyan : ఇది కదా పవన్ అంటే.. తప్పుచేస్తే ఫ్యాన్స్ అయినా, జనసైనికులు అయినా చర్యలు తీసుకుంటామని పోస్ట్..

Updated On : November 20, 2024 / 9:36 AM IST

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలనలో బిజీగా ఉన్నారు. తన చేతిలో ఉన్న శాఖలను పరుగులు పెట్టిస్తూ మిగతా శాఖలను కూడా గమనిస్తున్నారు. కొత్త కొత్త పనులకు శ్రీకారం చుడుతూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇటీవల సోషల్ మీడియాని ఉపయోగించుకొని తప్పుడు పోస్టులు, కుటుంబాలను, మహిళలను కించపరుతూ పోస్టులు చేసే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని పవన్ ఓ బహిరంగ సభలో అన్నారు. సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటక్షన్ బిల్ కూడా త్వరలోనే తెస్తామని అన్నారు.

ఈ క్రమంలో పవన్ జనసేన పార్టీ తమ పార్టీ కార్యకర్తలకు, పవన్ ఫ్యాన్స్ కు సూచనలు ఇస్తూనే హెచ్చరికలు జారీ చేసింది. జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ అయిన జనసేన శతాగ్ని పవన్ సూచనలతో, పార్టీ ఆదేశాలతో సోషల్ మీడియా గురించి ఓ పోస్ట్ చేసింది.

Also Read : ఏపీ శాసనసభ సమావేశాల్లో నేడు కీలక బిల్లులు.. సాయంత్రం క్యాబినెట్‌ భేటీ

ఇందులో.. సోషల్ మీడియాని భాద్యతగా, సమాజానికి ఉపయోగకరంగా వినియోగించాలి. పార్టీ విధానాలను, ప్రభుత్వ కార్యక్రమాలను, అధినేత పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేలా పనిచేయాలి. సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు, నాయకులు రెచ్చగొట్టేలా వ్యవహరించినప్పటికీ సంయమనంతో వ్యవహరించండి. పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పార్టీ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వీటిపై సమయానుకూలంగా పార్టీ, పార్టీ నాయకులు స్పందిస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇతర రాజకీయ నాయకులపై కానీ, సినీ నటులపై కానీ, ఏ ఇతర అంశాలపై కానీ తప్పుడు వార్తలు, అసభ్యకర పదజాలం, మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయడం లేదా షేర్ చేయడం, మహిళలు, పిల్లలపై తప్పుడు పోస్టులు పెట్టడం లేదా అలాంటి వారిని ప్రోత్సహించడం చట్టబద్దమైన నేరం. పార్టీ ముసుగులో లేదా అభిమాని ముసుగులో ఎవరైనా ఇలా చేస్తే వారిపై పార్టీ కఠినంగా వ్యవహరిస్తుంది. చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ పాలసీలు, ప్రజా సమస్యలు చర్చించేందుకు, సద్విమర్శలు, సూచనలకు సోషల్ మీడియా వేదిక కావాల్సిన అవసరం ఉంది. మీకు ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే మీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం దృష్టికి కానీ, నాయకుల దృష్టికి కానీ తీసుకురండి. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ కూడా త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ఇతరులకు ఆదర్శంగా నిలబడాలని, జనసైనికులు క్రమశిక్షణతో మెలగాలని విజ్ఞప్తి చేస్తున్నాము అంటూ పోస్ట్ చేసారు.

దీంతో సొంత పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను ఇలా చెప్పే ధైర్యం ఎవరికీ ఉంటుంది, తప్పు చేస్తే ఫ్యాన్స్ అయినా కఠిన చర్యలు తీసుకుంటామని ఏ హీరో చెప్తాడు, ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే, అందరిని సమానంగా చూస్తూ మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ అభినందనలు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by JanaSena Shatagni (@jspshatagniteam)