Jani Master : సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు.. మెగా ఫ్యామిలీపై జానీ మాస్టర్ ట్వీట్ వైరల్
సాధారణ డ్యాన్సర్ నుంచి డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగారు జానీ మాస్టర్.

Jani Master tweet viral over mega Family
సాధారణ డ్యాన్సర్ నుంచి డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగారు జానీ మాస్టర్. నిన్న ఆయన పుట్టిన రోజు. సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జానీ మాస్టర్ ని ఇంటికి పిలిచి మరీ స్పెషల్ గా బర్త్ డే విషెష్ చెప్పి బహుమతిని అందించారు. కాగా.. నేడు సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అని జానీ మాస్టర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
నా పుట్టినరోజు సందర్భంగా రామ్‌చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా. అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది. నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టి.ఎఫ్.టి.టి.డి.ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు.
SVC 58 : వెంకటేశ్ అనీల్ రావిపూడి సినిమా మొదలు.. సంక్రాంతి బరిలో.. !
అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అని జానీ మాస్టర్ ట్వీట్ చేశారు.
View this post on Instagram