Kalyanam Kamaneeyam: కళ్యాణం కమనీయం… ఆహా అనిపిస్తోన్న ఓటీటీ న్యూస్..!

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కళ్యాణం కమనీయం’ నేడు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ ఆళ్ల పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయగా, ఈ సినిమాకు థియేటర్లలో మంచి టాక్ లభిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Kalyanam Kamaneeyam: కళ్యాణం కమనీయం… ఆహా అనిపిస్తోన్న ఓటీటీ న్యూస్..!

Kalyanam Kamaneeyam Confims OTT Partner

Updated On : January 14, 2023 / 3:27 PM IST

Kalyanam Kamaneeyam: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కళ్యాణం కమనీయం’ నేడు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ ఆళ్ల పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయగా, ఈ సినిమాకు థియేటర్లలో మంచి టాక్ లభిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Kalyanam Kamaneeyam: కళ్యాణం కమనీయం.. రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్!

ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమా నేడు రిలీజ్ అవుతున్న తరుణంలో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ కాన్సెప్ట్స్ ప్రొడ్యూస్ చేయగా, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను మంచి ఫ్యాన్సీ రేటుకు ఆహా సొంతం చేసుకున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Kalyanam Kamaneeyam: స్వీట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కళ్యాణం కమనీయం ట్రైలర్.. పండగ బరిలో మరోకటి!

కాగా, యూత్‌ను బాగా ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా వస్తుండగా, సంతోష్ శోభన్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించగా, బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలకు ఈ సినిమా ఎలాంటి పోటీనిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.