Indian 2 : హమ్మయ్య.. ఇండియన్ 2 షూటింగ్ పూర్తి.. చరణ్ ఫ్యాన్స్ హ్యాపీ.. గేమ్ ఛేంజర్‌ని ఏం చేస్తారో?
ఇప్పుడు ఇండియన్ 2 షూటింగ్ అయిపోయిందని తెలియడంతో చరణ్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Kamal Haasan Shankar Indian 2 Movie Shooting Completed Ram Charan Game Changer Update
Indian 2 Shooting : స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క రామ్ చరణ్(Ram Charan) తో గేమ్ ఛేంజర్”(Game changer) ని మొదలుపెట్టి దాన్ని మధ్యలో ఆపేసి మళ్ళీ కమల్ హాసన్ తో ఇండియన్ 2 షూటింగ్ చేశాడు. ఇండియన్ 2 షూట్ గ్యాప్స్ లో అప్పుడప్పుడు చరణ్ తో గేమ్ ఛేంజర్ షూట్ చేసాడు. దీంతో రెండు సినిమాలు పూర్తికాక వీటి పనులు నిదానంగా నడుస్తున్నాయి.
తాజాగా ఇండియన్ 2 షూటింగ్ పూర్తయిందని ఓ ఫోటో పోస్ట్ చేసి తెలిపారు చిత్రయూనిట్. ఈ ఫొటోలో సినిమాకు వర్క్ చేసిన పలువురు కమల్ తో కలిసి ఉన్నారు. ఈ ఫొటోలో దర్శకుఢు శంకర్ లేకపోవడం విశేషం. ఇండియన్ 2 షూటింగ్ పూర్తవ్వగా సినిమాని 2024 సమ్మర్ కి రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇండియన్ 3 కూడా ఉందని గతంలో చెప్పారు. మరి దాని షూటింగ్ అయిపోయిందా లేదా తెలియాలి.
ఇప్పుడు ఇండియన్ 2 షూటింగ్ అయిపోయిందని తెలియడంతో చరణ్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసిన గేమ్ ఛేంజర్ సినిమా ఇంకా సాగుతూనే ఉంది. ఇండియన్ 2 బిజీలో శంకర్ ఆటే ఎక్కువ టైం ఇచ్చాడు. ఇండియన్ 2 షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా మరి గేమ్ ఛేంజర్ ని త్వరగా పూర్తి చేయాలి అని చరణ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇటీవల నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమాని 2024 సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అప్పటికి సినిమా రావాలంటే శంకర్ చాలా ఫాస్ట్ గా గేమ్ ఛేంజర్ షూట్ మొదలుపెట్టాలి. చరణ్ ఫ్యాన్స్ ఇప్పుడు శంకర్ నే నమ్ముకొని కూర్చున్నారు.
?✨ That's a wrap for #Indian2! ???
Get ready for a cinematic spectacle like no other. #Indian2Wrap #KamalHaasanMagic #CinematicExtravaganza #Indian2ReleaseComingSoon pic.twitter.com/iACmFlYIUp— Indian Box Office (@TradeBOC) January 2, 2024