Kamal Haasan: ఆడియెన్స్‌కు థ్యాంక్స్ చెప్పిన కమల్ హాసన్

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. కమల్ హాసన్ అభిమాని....

Kamal Haasan: ఆడియెన్స్‌కు థ్యాంక్స్ చెప్పిన కమల్ హాసన్

Kamal Haasan Thanks Audience For Vikram Success

Updated On : June 7, 2022 / 4:03 PM IST

Kamal Haasan: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. కమల్ హాసన్ అభిమాని అయిన లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించడంతో, ఈ సినిమా అభిమానులను కట్టిపడేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ఓ రేంజ్‌లో ఉండటంతో, ఈ చిత్రాన్ని చూసేందుకు కమల్ హాసన్ అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

Vikram : కమల్ హాసన్ అన్న.. సూర్య తంబి.. స్పెషల్ ట్వీట్..

ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ ఎప్పటిలాగే తన పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను కట్టిపడేశాడు. ఆయన వయసుకు మించిన యాక్షన్ సీక్వెన్స్‌లను అలవోకగా చేయడంతో అభిమానులకు ఫుల్ ట్రీట్ దొరికింది. చాలా కాలం తరువాత కమల్ నుండి ఇలాంటి సినిమా రావడంతో ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లాంటి ట్యాలెంటెడ్ యాక్టర్స్ కూడా రెచ్చిపోయి నటించగా.. క్లైమాక్స్‌లో సూర్య ఎంట్రీ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ సినిమాకు తెలుగు నాట కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం ఇక్కడ కూడా ఘన విజయాన్ని అందుకుంది.

Vikram: ‘విక్రమ్’ బ్లాక్‌బస్టర్ అంటున్నతమిళ హీరో

అయితే తాజాగా విక్రమ్ చిత్రం సక్సెస్ కావడంపై కమల్ హాసన్ తన అభిమానులతో పాటు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. విక్రమ్ చిత్రాన్ని ఇంతటి ఘన విజయాన్ని చేసిన తెలుగు ప్రేక్షకులకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కమల్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ కమల్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక విక్రమ్ చిత్రాన్ని తెలుగులో నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.