వంద కోట్ల క్లబ్‌లో కాంచన-3
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడురోజుల్లోనే రూ.9.18 కోట్ల షేర్ రాబట్టిన కాంచన-3, విడుదలై వారం కాకుండానే రూ.100 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిపోయింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడురోజుల్లోనే రూ.9.18 కోట్ల షేర్ రాబట్టిన కాంచన-3, విడుదలై వారం కాకుండానే రూ.100 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిపోయింది.
రాఘవ లారెన్స్ నటిస్తూ, డైరెక్ట్ చేసిన మూవీ కాంచన-3.. ముని, కాంచన, గంగ సినిమాల తర్వాత, ముని సిరీస్‌లో నాలుగవ సినిమాగా రూపొందిన కాంచన-3 భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 19న తమిళ్, తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. నెగెటివ్ టాక్ వచ్చినా సరే, ఫస్ట్ డే మార్నింగ్ షో నుండే అన్ని థియేటర్ల బయట హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా బీ, సీ సెంటర్స్‌లో బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబడుతూ, నాని జెర్సీ సినిమాకి గట్టిపోటీ ఇస్తుంది. కాంచన-3 దెబ్బకి చిత్రలహరి చాలా వీక్ అయ్యింది. ఫస్ట్ వీకెండ్‌లో బాక్సాఫీస్ దగ్గర ఒక డబ్బింగ్ సినిమా ఇంతలా సత్తాచాటడం విశేషం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడురోజుల్లోనే రూ.9.18 కోట్ల షేర్ రాబట్టిన కాంచన-3, విడుదలై వారం కాకుండానే రూ.100 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిపోయింది. జెర్సీ లాంటి సినిమా పోటీ ఉన్నా, కాంచన-3 ఈ రేంజ్‌లో వసూళ్ళు రాబట్టడం ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్‌ని దాటేసిన కాంచన-3, ముందు ముందు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మరి..
వాచ్ ట్రైలర్..