నయనతార ఓ ఫైటర్.. కత్రినా కైఫ్

సౌత్ సూపర్ స్టార్ నయనతారను బాలీవుడ్ బ్యూటీ కత్రినా పొగడ్తలతో ముంచేశారు. తను ఓ ఫైటర్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తుంది. కత్రినా మేకప్ బ్రాండ్ కే (Kay)కు నయన బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార ప్రకటనలో భాగంగా నయన్, కత్రినా ముంబైలో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ.. నీ బీజీ షేడ్యూల్‌లో కూడా ముంబై వచ్చి మా మేకప్ బ్రాండ్ ప్రకటన ఇచ్చినందుకు చాలా థాంక్స్ అని చెప్పారు. అంతేకాదు మీలో ఏదో ప్రత్యేకత ఉందని.. మీ అందానికి నా సలాం అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.
ఇక తన అద్భుత నటన, తన సంకల్పం చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. తను ఓ ఫైటర్. పోరాట యోధురాలిగా కనిపిస్తుంది.
అంతేగాక ఆమెలో ఓ ఫైటర్‌ను చూశాను.. ఆమెను చూస్తే స్టన్నింగ్‌గా అనిపించింది. మానసికంగా ధృడమైన మహిళగా కనిపించారు. పనిపట్ల ఆమె చూపే శ్రద్ద నన్ను బాగా ఆకట్టుకొన్నది అని కత్రినా కైఫ్ తెలిపారు. నయనతారను కలిసిన ఈ రోజు నా జీవితంలో ఓ మ్యాజిక్ డే అని కత్రినా కైఫ్ పొగడ్తల వర్షం కురిపించారు.
Read: బాలకృష్ణ, నాగబాబు వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం : తమ్మారెడ్డి భరద్వాజ