Bahubali : బాహుబలి బోడి సినిమా.. రాజమౌళితో కీరవాణి భార్య వ్యాఖ్యలు..

బాహుబలి సినిమాని రాజమౌళి ఇంట్లోవాళ్లే విమర్శించారట. తాజాగా ఈ విషయాన్ని హీరో నాని తెలిపాడు.

Bahubali : బాహుబలి బోడి సినిమా.. రాజమౌళితో కీరవాణి భార్య వ్యాఖ్యలు..

Keeravani Wife Valli Sensational Comments on Bahubali Movie with Rajamouli

Updated On : August 11, 2023 / 5:13 PM IST

Bahubali Movie : దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తన ప్రతి సినిమాతోనూ ప్రేక్షకులని మెప్పిస్తారు. ఇక ప్రభాస్ తో తీసిన బాహుబలి సినిమాతో ఇండియా అందర్నీ మెప్పించి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయి తెలుగు సినిమాలకు పాన్ ఇండియా స్థాయిని తెచ్చాడు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో భారీ సినిమాలు, పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు వస్తున్నాయంటే అందుకు కారణం రాజమౌళినే. బాహుబలి సినిమా అంతటి భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా రెండు పార్టులు కూడా పెద్ద హిట్ అయి అత్యధిక కలెక్షన్స్ సాధించి అప్పటిదాకా ఉన్న ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టింది.

అయితే అలాంటి బాహుబలి సినిమాని రాజమౌళి ఇంట్లోవాళ్లే విమర్శించారట. తాజాగా ఈ విషయాన్ని హీరో నాని తెలిపాడు. కీరవాణి(Keeravani) చిన్నకొడుకు శ్రీసింహ(Sri Simha) హీరోగా నటించిన ఉస్తాద్(Ustaad) సినిమా రేపు ఆగస్టు 12న రిలీజ్ కాబోతుంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి ఫ్యామిలీ అంతా వచ్చారు. హీరో నాని(Nani) ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు.

Chiranjeevi – Ajith : అప్పుడు అజిత్ ఫస్ట్ సినిమాను ఆశీర్వదించి.. ఇప్పుడు అజిత్ సినిమాని రీమేక్ చేసిన మెగాస్టార్..

నాని ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ గతంలో రాజమౌళి ఫ్యామిలీతో జరిగిన ఓ సంఘటనని గుర్తుచేశారు. నాని మాట్లాడుతూ.. బాహుబలి రిలీజయి దేశమంతా పెద్ద హిట్ అయి ఫుల్ ఊపులో ఉన్నప్పుడు రాజమౌళి, వీళ్ళ ఫ్యామిలీ అంతా బళ్లారిలో ఇంట్లో ఉన్నారు. నేను అదే సమయానికి వీళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఇంట్లో వాళ్లంతా కూర్చొని ఉన్నారు. దగ్గర్లో ఓ థియేటర్లో బాహుబలి సినిమా ఆడుతుంది. మళ్ళీ వెల్దామా అని రాజమౌళి అడగ్గానే వెంటనే వల్లి గారు తీసావులే బోడి సినిమా, మళ్ళీ చూస్తామా వెళ్లి అని అన్నారు. అంటే బాహుబలి లాంటి గ్రేట్ సినిమా ఇచ్చినా ఇంత సింపుల్ గా మాట్లాడేస్తే కచ్చితంగా గర్వం లేకుండా గ్రౌండ్ లోనే ఉంటాము అని తెలుపుతూ రాజమౌళి ఫ్యామిలీ గురించి పొగిడారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.