KGF2: బాక్సాఫీస్ దగ్గర కేజీఎఫ్ కుమ్ముడు.. మరో 8 రోజులు అడ్డేలేదు

వారం క్రితం రిలీజ్ అయ్యింది. కన్నడ సినిమా అయినా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలుకొడుతోంది. అయినా.. ఇక్కడా.. అక్కడా అని లేదు.. కెజిఎఫ్ ఎక్కడ కాలు పెట్టినా.. కలెక్షన్ల కుమ్ముడే..

KGF2: బాక్సాఫీస్ దగ్గర కేజీఎఫ్ కుమ్ముడు.. మరో 8 రోజులు అడ్డేలేదు

Kgf2

Updated On : April 22, 2022 / 7:51 AM IST

KGF2: వారం క్రితం రిలీజ్ అయ్యింది. కన్నడ సినిమా అయినా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలుకొడుతోంది. అయినా.. ఇక్కడా.. అక్కడా అని లేదు.. కెజిఎఫ్ ఎక్కడ కాలు పెట్టినా.. కలెక్షన్ల కుమ్ముడే అంటున్నారు ఫాన్స్. వారం రోజుల్లోనే బాలీవుడ్ స్టార్ల రికార్డులు బద్దలు కొట్టిన కెజిఎఫ్.. ఇంకెన్ని రికార్డులు సాధించాలన్నా.. జస్ట్ 8 రోజులే ఉంది. వచ్చే 8 రోజుల్లో కెజిఎఫ్ కుమ్ముడు ఎలా ఉండబోతోంది..? ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చెయ్యబోతోంది..? ఇంకెన్ని సినిమాల రికార్డులు బద్దలు కొట్టబోతోంది..?

KGF2: ‘కేజీయఫ్’కు కొత్త తలనొప్పి.. రంగంలోకి దిగిన రియల్ రాఖీ భాయ్ ఫ్యామిలీ!

తూఫాన్ కంటే స్పీడ్ గా సునామి లాంటి కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర మిగిలిన సినిమాల కలెక్షన్ల రికార్డులన్నింటినీ మాన్ స్టర్ లాగా మింగేసింది కెజిఎఫ్2. రిలీజ్ అయ్యి వారం రోజులు దాటినా ఏమాత్రం కలెక్షన్లు తగ్గకుండా నాన్ స్టాప్ రికార్డులతో దూసుకుపోతూ బాలీవుడ్ కి చుక్కలు చూపిస్తోంది. పోయిన గురువారం రిలీజ్ అయిన కెజిఎఫ్ వారం రోజుల్లోనే 250 కోట్ల కలెక్షన్లు దాటి బాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అయితే కెజిఎఫ్ కలెక్షన్ల దూకుడికి మిగిలున్నది ఇంకా 8 రోజులే.

KGF2: కేజీఎఫ్ విక్టరీ వెనుక ఆ ముగ్గురు.. అసలెలా పట్టుకున్నారు?

కెజిఎఫ్..2 ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్లు కంటిన్యూ చేస్తోంది. అటు కెజిఎఫ్ 2 కలెక్షన్లకు కళ్లెం వేసే సినిమాలు దరిదాపుల్లో కూడా లేవు . ఒక వేళ జెర్సీ మూవీ బాలీవుడ్ లో రిలీజ్ అయినా కూడా కెజిఎఫ్ క్రేజ్ ని దాటడం కష్టమే అంటున్నారు జనాలు. ఈ వారం ఎలాగూ కెజిఎఫ్ ని ఢీ కొట్టే సినిమాలు ఇటు సౌత్ లో కూడా ఏం లేవు. సో.. కెజిఎఫ్ కలెక్షన్ల కుమ్ముడు ఇంకో వారం రోజులు కంటిన్యూ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫాన్స్.

KGF2: ఓవర్సీస్‌లోనూ అదే జోరు.. ఏకంగా 3 మిలియన్‌లతో దుమ్ములేపేశారు!

కెజిఎఫ్ ఇప్పటికే 7 రోజుల్లో 255 కోట్లు కలెక్ట్ చేసి టాప్ ప్లేస్ లో ఉంది. అసలు కెజిఎఫ్ బాలీవుడ్ లో ఫస్ట్ నుంచి దూకుడు చూపిస్తూనే ఉంది. కెజిఎఫ్ రిలీజ్ అయినరోజు ఏప్రిల్ 14 గురువారం.. 53.95 కోట్లు, శుక్రవారం..46.79కోట్లు, మూడో రోజైన శనివారం 42 కోట్లు, ఆది.. 50 కలెక్ట్ చేసింది వీక్ స్టార్టింగ్ డే అయిన సోమవారం కూడా 25 కోట్లు కలెక్ట్ చేసి క్రేజ్ తగ్గేదేలే అనిప్రూవ్ చేసింది. ఇక మంగళవారం 19కోట్లు, బుధవారం 16 కోట్లు కలెక్ట్ చేసి మొత్తం 255 కోట్ల కలెక్షన్లు దాటేసింది.

KGF2: 8 ఏళ్ళ ప్రయాణం.. రాఖీ భాయ్ రికార్డుల వెనక కష్టం తెలుసా?

బాహుబలి 8 రోజుల్లో, దంగల్, సంజు, టైగర్ జిందా హే లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు..10 రోజుల్లో కలెక్ట్ చేసిన 250 కోట్ల కలెక్షన్లు కెజిఎఫ్2 జస్ట్ 7రోజుల్లోనే బాలీవుడ్ లో కలెక్ట్ చేసింది. అయితే ఈ కలెక్షన్లకు బ్రేకులు ఇప్పట్లో పడకపోవచ్చు. ఇంకో 8 రోజులు కెజిఎఫ్ కి ఈ కలెక్షన్లు రాబట్టుకునే ఛాన్స్ ఉంది. నెక్ట్స్ వీక్ ఇటు తెలుగులో మెగాస్టార్ ఆచార్య, తమిళ్ లో సమంత, విజయ్ సేతుపతి, నయనతార మూవీ కాతువాతుల రెండు కాదల్, హిందీలో హీరోపన్తి 2 రిలీజ్ అవుతున్నాయి. సో.. ఈ మూడు సినిమాలు కెజిఎఫ్ కలెక్షన్ల మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది కాబట్టి.. వచ్చే వారం రోజుల్లో కెజిఎఫ్.. మరో 100 కోట్లు టార్గెట్ ని ఈజీ గా రీచ్ అవుతుందంటున్నారు బాలీవుడ్ జనాలు.