Kiara Advani : కియారాకి సిద్దార్థ్ ఎలా ప్రపోజ్ చేసాడో తెలుసా? సినిమా స్టైల్లో..

బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్ధ్ మల్హోత్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కియారా సిద్ధార్ధ్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడో తాజాగా ఓ షోలో షేర్ చేసుకోవడంతో వైరల్ అవుతోంది.

Kiara Advani : కియారాకి సిద్దార్థ్ ఎలా ప్రపోజ్ చేసాడో తెలుసా? సినిమా స్టైల్లో..

Kiara Advani

Updated On : December 8, 2023 / 3:52 PM IST

Kiara Advani : సినిమాల్లో హీరో, హీరోయిన్లు లవ్ ప్రపోజ్ చేసుకోవడం చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. అదే నిజ జీవితంలో కూడా సినిమా స్టైల్లో ప్రేమను వ్యక్తం చేసుకన్న జంటలు కూడా ఉన్నారు. బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్ధ్ మల్హోత్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  అయితే సిద్ధార్ధ్ తనకు ఎంత అందంగా ప్రపోజ్ చేశాడో తాజాగా ఓ షోలో కియారా షేర్ చేసుకుంది.

Allu Arjun : ‘యానిమల్’ సినిమాపై అల్లు అర్జున్.. ఇండియన్ క్లాసిక్ సినిమా అంటూ తెగ పొగడ్తలు..

రీసెంట్‌గా కియారా నటుడు విక్కా కౌశల్‌‌లు ‘కాఫీ విత్ కరణ్’ షోలో పార్టిసిపేట్ చేసారు. ఈ ఎపిసోడ్‌లో కియారా తన లవ్ లైఫ్ గురించి, సిద్ధార్ధ్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడు? అనే విషయాలపై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఫ్యామిలీతో పాటు రోమ్ పర్యటనలో ఉన్న సిద్ధార్థ్ తనను కలిసాడని ఆ సమయంలో తను ప్రపోజ్ చేస్తాడని మనసులో ఎందుకో అనిపించిందని కియారా చెప్పారు. తనకు ప్రపోజ్ చేసేముందు తన పేరెంట్స్ నుండి సిద్ధార్ధ్ అనుమతి తీసుకున్నట్లు కియారా చెప్పుకొచ్చారు.

సిద్ధార్థ్ కియారాని మిచెలిన్ రెస్టారెంట్‌కి తీసుకెళ్లాడట. సిద్ధార్ధ్‌తో పాటు అతని మేనల్లుడు కూడా ఉన్నాడని.. సిద్ధార్ధ్ ప్రపోజ్ చేసే క్షణాల్ని కెమెరాలో క్యాప్చర్ చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడని చెప్పింది. కియారాను క్యాండిల్ లైట్ డిన్నర్‌కి తీసుకెళ్లాడట సిద్ధార్థ్. డిన్నర్ పూర్తై ఇద్దరు అలా నడుచుకుని వెళ్తుంటే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వయోలిన్ వాయిస్తూ పొదల్లోంచి బయటకు వచ్చాడని, సిద్ధార్ధ్ మేనల్లుడు వీడియో క్యాప్చర్ చేస్తున్నాడని ఇక సిద్ధార్ధ్ మోకాలిపై కూర్చుని ప్రపోజ్  చేయడంతో చాలా హ్యాపీ అయినట్లు చెప్పారు కియారా. వెంటనే సిద్ధార్ధ్ ‘షేర్షా’ సినిమాలో  ‘ఆలంపూర్ కా సిధా సాధ లౌండా హు (నేను ఆలంపూర్‌కి చెందిన సాధారణ అబ్బాయిని) అంటూ స్క్రీన్ మీద తనకు ఎలా ప్రపోజ్ చేశాడో అలాగే రియల్‌గా కూడా ప్రపోజ్ చేయడంతో తను పగలబడి నవ్వినట్లు కియారా చెప్పారు.

Varun Lavanya : వరుణ్ లావణ్య హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లారో తెలుసా? అంత మంచులో ఎవరూ వెళ్లి ఉండరు ఇప్పటిదాకా..

కియారా అద్వానీ, సిద్ధార్ధ్ మల్హోత్రా ఈ ఏడాది ఫిబ్రవరి 7 న ఒక్కటయ్యారు. జైసల్మేర్‌లో వీరి పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది.