Kota Shankar Rao : అన్నకు నివాళులు అర్పించిన కోట శంకర్ రావు.. చాన్నాళ్లకు కనపడిన కోట శ్రీనివాసరావు తమ్ముడు..

కోట శ్రీనివాసరావు తమ్ముడు కోట శంకర్ రావు కూడా కనిపించారు.

Kota Shankar Rao : అన్నకు నివాళులు అర్పించిన కోట శంకర్ రావు.. చాన్నాళ్లకు కనపడిన కోట శ్రీనివాసరావు తమ్ముడు..

Kota Shankar Rao

Updated On : July 13, 2025 / 4:31 PM IST

Kota Shankar Rao : నేడు ఉదయం నటుడు కోట శ్రీనివాసరావు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు కోట ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు తమ్ముడు కోట శంకర్ రావు కూడా కనిపించారు.

కోట శ్రీనివాసరావు తమ్ముడు కోట శంకర్ రావు కూడా అన్నయ్య బాటలోనే వచ్చి నటుడిగా పలు సినిమాల్లో నటించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాల్లో నటించారు. కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. గత కొన్నాళ్లుగా కోట శంకర్ రావు బయట మీడియాలో కానీ, సినిమాల్లో కానీ ఎక్కువగా కనిపించట్లేదు. వయోభారంతో ఆయన కూడా సినిమాలకు దూరమయ్యారు.

Also Read : Kota Srinivasa Rao : అన్నయ్యతో మొదటి సినిమా.. తమ్ముడితో చివరి సినిమా.. కోట శ్రీనివాసరావు చివరి సినిమా త్వరలో..

నేడు అన్నయ్య కోట శ్రీనివాసరావు మరణించడంతో ఆయన ఇంటికి వచ్చారు కోట శంకర్ రావు. అన్నయ్యకు నివాళులు అర్పించి అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. దీంతో కోట శంకర్ రావు కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Kota Shankar Rao Pays Tributes to Brother Kota Srinivasa Rao

Also Read : Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు కెరీర్ మలుపు తిప్పిన సినిమా.. కోట కోసం రామానాయుడుతో జంధ్యాల గొడవ..