MAA Elections : మా’ ఎన్నికల తేదీ ఖరారు.. ఎప్పుడంటే?
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ MAA ఎన్నికల తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించనున్నారు. ‘మా’ ఎన్నికల తేదీని క్రమశిక్షణ కమిటీ ఖరారు చేసింది.

Maa Elections To Be Held On October 10, Offical Confirmation May Come Soon
MAA elections on October 10 : టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ MAA ఎన్నికల తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు ‘మా’ ఎన్నికల తేదీని క్రమశిక్షణ కమిటీ ఖరారు చేసింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ‘మా’ ఎన్నికలు నిర్వహించేందుకు టాలీవుడ్ నటీనటులు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకూ మా ఎన్నికల కోసం రెండు వర్గాల మధ్య పోటాపోటీగా నడిచింది. సాధారణ రాజీయ ఎన్నికలను తలపించేలా హీట్ పెంచేశాయి. మా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? ఎవరు విజయం సాధిస్తారా అనే అంశాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.
‘మా’ ఎన్నికలకు పోటీ చేస్తానని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించగా, తాను కూడా ఈ పోటీలో పాల్గొంటానని హీరో మంచు విష్ణు ప్రకటించడంతో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఏదిఏమైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్.. సభ్యులు జీవితా రాజశేఖర్, క్రమశిక్షణ సంఘం కృష్ణం రాజు అధ్యక్షతన సమావేశాలు నిర్వహించారు. ఇటీవలే జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో ‘మా’ ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు.
Bandla Ganesh : ‘మా’ కి బిల్డింగ్ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు..
సెప్టెంబర్ 29న గణేశ్ నిమజ్జనం ఉండటంతో ఆ రోజున ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని, అందుకే సెప్టెంబర్ 26న అందరికీ వీలుగా ఉంటుందని మా సభ్యులు అభిప్రాయపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ నెలలలో జరిపితే మంచిదనే ఇప్పుడు మా సభ్యులు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎట్టకేలకు మా ఎన్నికల తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న మా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు.
అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారంలో జోరుపెంచనున్నారు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ, సీవిఎల్ నరసింహరావు, జీవితా రాజశేఖర్ అధ్యక్ష పోటీలో ఉన్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యుల జాబితాను విడుదల చేశారు. ఆన్‌లైన్ వేదికగా మా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. క్రమశిక్షణ కమిటీ ప్రకారమే చేస్తామని మా అధ్యక్షుడు నరేష్ అభిప్రాయపడ్డారు. దాంతో మా ఎన్నికల తేదీని ఖరారు చేస్తూ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది.
Prakash Raj : ‘మా’లో కాక రేపుతున్న ప్రకాశ్‌రాజ్ ట్వీట్