యానిమేటెడ్‌ వర్షన్‌ లో మహర్షి టీజర్!

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 05:53 AM IST
యానిమేటెడ్‌ వర్షన్‌ లో మహర్షి టీజర్!

Updated On : April 11, 2019 / 5:53 AM IST

మహేశ్ బాబు  కొత్త చిత్రం మహర్షి టీజర్ యూట్యూబ్ లో భారీ అంచనాల మధ్య దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు  ‘మహర్షి’ మరో టీజర్ వైరల్ గా మారింది. అది మరేదో కాదు మహేష్‌ ఫ్యాన్స్ కొందరు ఈ టీజర్‌ కు యానిమేటెడ్‌ వర్షన్‌ ను రూపొందించారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ టీజర్ కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. 

ఈ యానిమేటెడ్‌ టీజర్‌ పై స్పందించిన మహర్షి చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి యానిమేటెడ్‌ వెర్షన్‌ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. మీరు ప్రతీ సినిమాను మాకు ప్రత్యేకంగా మార్చేస్తున్నారు. మీకు రుణపడి ఉంటాం, ఈ వీడియో రూపొందించిన మహేష్ ఫ్యాన్స్ కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. అల్లరి నరేష్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందించాడు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.