మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ : అతిథులు వీళ్ళే

మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ఇప్పటివరకు మహేష్‌తో పనిచేసిన దర్శకులందరూ అతిథులుగా రానున్నారు..

  • Published By: sekhar ,Published On : April 25, 2019 / 06:35 AM IST
మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ : అతిథులు వీళ్ళే

Updated On : April 25, 2019 / 6:35 AM IST

మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ఇప్పటివరకు మహేష్‌తో పనిచేసిన దర్శకులందరూ అతిథులుగా రానున్నారు..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా.. మహర్షి.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీదత్, దిల్ రాజు, పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా, అల్లరి నరేష్ హీరో ఫ్రెండ్‌గా నటించారు. మహర్షి టీజర్ అండ్ సాంగ్స్‌కి ఆడియన్స్ నుండి వెరీగుడ్ రెస్పాన్స్ వస్తుంది. మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని, పీపుల్స్ ప్లాజాలో, మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మహేష్‌తో పనిచేసిన దర్శకులందరూ ఈ వేడుకకు రానున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని కన్‌ఫమ్ చేస్తూ, మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథులుగా రానున్న దర్శకులు ఎవరనేది అనౌన్స్ చేసారు నిర్మాతలు..

రాజకుమారుడు సినిమాతో మహేష్‌ని హీరోగా పరిచయం చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావుతో మొదలుకొని, వై.వి.ఎస్. చౌదరి, బి.గోపాల్, కృష్ణవంశీ, జయంత్ సి.పరాన్జీ, గుణ శేఖర్, తేజ, ఎస్.జె.సూర్య, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్, సురేందర్ రెడ్డి, శ్రీకాంత్ అడ్డాల, శ్రీను వైట్ల, సుకుమార్, కొరటాల శివలతో పాటు, తర్వలో మహేష్‌ని డైరెక్ట్ చెయ్యనున్న అనిల్ రావిపూడి కూడా ఈ ఫంక్షన్‌కి అటెండ్ అవబోతున్నారు. బాబీ సినిమా డైరెక్టర్ శోభన్ స్వర్గస్తులైన సంగతి తెలిసిందే.
మహర్షి.. మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజవబోతుంది..

వాచ్ మహర్షి టీజర్..