మహర్షి రన్ టైమ్ ఎంతంటే?

మహర్షి రన్ టైమ్ మాత్రం 172 నిమిషాలు ఉందట. అంటే ఎనిమిది నిమిషాల తక్కువ మూడు గంటలన్నమాట. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకుడికి డ్యూరేషన్‌తో పని ఉండదు..

  • Published By: sekhar ,Published On : May 4, 2019 / 09:44 AM IST
మహర్షి రన్ టైమ్ ఎంతంటే?

Updated On : May 4, 2019 / 9:44 AM IST

మహర్షి రన్ టైమ్ మాత్రం 172 నిమిషాలు ఉందట. అంటే ఎనిమిది నిమిషాల తక్కువ మూడు గంటలన్నమాట. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకుడికి డ్యూరేషన్‌తో పని ఉండదు..

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి  మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, వైజయంతీ మూవీస్.. అశ్వినీదత్, శ్రీ వెకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు, పివిపి సినిమా.. పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మించిన మహర్షి రీసెంట్‌గా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్, ఎటువంటి కట్స్ చెప్పకుండా.. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే సినిమా నిడివి మాత్రం ఎక్కువగా ఉందని అంటున్నారు.

ఇప్పుడొచ్చే సినిమలు రెండు, రెండున్నర గంటలకు మించి ఉండడంలేదు. మహర్షి రన్ టైమ్ మాత్రం 172 నిమిషాలు ఉందట. అంటే ఎనిమిది నిమిషాల తక్కువ మూడు గంటలన్నమాట. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకుడికి డ్యూరేషన్‌తో పని ఉండదు. రంగస్థలం, భరత్ అనే నేను కూడా మూడు గంటల సినిమాలే.. చెప్పాలనుకున్న విషయాన్ని క్లారిటీగా చెప్పాలనుకున్నప్పుడు నిడివి అనేది తప్పనిసరి. ఆ కోణంలో చూస్తే కనక మహర్షి రన్ టైమ్ ఆమాత్రం ఉండడం సబబే అని చెప్పాలి. పూజా హెగ్డే హీరోయిన్‌గా, అల్లరి నరేష్ హీరో ఫ్రెండ్‌గా నటించిన మహర్షి 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

వాచ్ మహర్షి ట్రైలర్..