బాక్సాఫీస్ ఘరానా మొగుడు: సైరాపై మహేష్ బాబు ప్రశంసలు

  • Published By: vamsi ,Published On : October 2, 2019 / 04:14 PM IST
బాక్సాఫీస్ ఘరానా మొగుడు: సైరాపై మహేష్ బాబు ప్రశంసలు

Updated On : October 2, 2019 / 4:14 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మాతగా మారి సైరా నరసింహారెడ్డి సినిమా గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన ప్రతీ చోట సినిమా గురించి మంచి టాక్ వినిపిస్తుండగా.. సెలబ్రిటీలు కూడా సినిమా గురించి వారి అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.

ఈ సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. నేచురల్ స్టార్ నాని, సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా సైరా సినిమా గురించి స్పందించారు. ప్రస్తుతం సౌత్ కొరియాలో ఉన్న నాని.. నేను ఇప్పుడు సౌత్ కొరియాలో ఉన్నా.. ఇక్కడ సైరా సినిమా చూడడానికి ఎలాంటి అవకాశం లేదు.

కానీ టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఇండియాలో బాక్సాఫీస్ ఘరానా మొగుడు ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. చిరంజీవి గారికి శుభాకాంక్షలు అని నాని ట్వీట్ చేశాడు.

ఇదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమాపై స్పందించారు. అత్యున్నత విలువలతో సినిమాను చాలా గొప్పగా తీశారని, సినిమా విజువల్స్ చాలా బాగున్నాయని అన్నారు. చిరంజీవి గారి నటన అధ్భుతం అని అన్నారు.

సినిమా తప్పక చూడాలని, నిర్మాత రామ్‌చరణ్ కు అభినందనలు తెలిపారు. అలాగే అత్యుత్తమ సినిమాటోగ్రఫీ అందించిన రత్నవేలు గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలని అన్నారు. ఇటీవలి కాలంలో ఇది ది బెస్ట్ సినిమా అన్నారు.