Mahesh Babu : జవాన్ సినిమాపై మహేష్ బాబు రివ్యూ చూశారా.. మహేష్ కి ఎంతగా నచ్చిందంటే..

తాజాగా మహేష్ బాబు సినిమా చూసి జవాన్ పై రివ్యూ కూడా ఇచ్చాడు. సినిమా రిలీజ్ కి ముందు మహేష్ షారుఖ్ కి, టీంకి అల్ ది బెస్ట్ కూడా చెప్పగా..........

Mahesh Babu : జవాన్ సినిమాపై మహేష్ బాబు రివ్యూ చూశారా.. మహేష్ కి ఎంతగా నచ్చిందంటే..

Mahesh Babu Review on Jawan Movie and Praised Shahrukh Khan

Updated On : September 8, 2023 / 11:45 AM IST

Mahesh Babu : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నేడు సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్(Jawan) సినిమాతో వచ్చాడు. ఇందులో నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటించారు. ప్రియమణి, దీపికా పదుకొనే.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కింది.

ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డ్ సెట్ చేసింది జవాన్. మొదటి రోజు కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయని సమాచారం. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మనకు సౌత్ వాళ్లకి పాత కథే అయినా నార్త్ వాళ్లకి చాలా కొత్తగా ఉండటంతో సినిమాని ఆకాశానికెత్తేస్తున్నారు. మనకి తెలిసిన కథలో షారుఖ్ ని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు అట్లీ. సినిమా చూసిన వాళ్లంతా తమ రివ్యూలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంటున్నారు.

Bahubali 2 : ఇప్పటికి అందులో బాహుబలి 2 రికార్డ్‌ని ఎవ్వరు టచ్ చేయలేదు.. జవాన్ వల్ల కూడా కాలేదు..

తాజాగా మహేష్ బాబు సినిమా చూసి జవాన్ పై రివ్యూ కూడా ఇచ్చాడు. సినిమా రిలీజ్ కి ముందు మహేష్ షారుఖ్ కి, టీంకి అల్ ది బెస్ట్ కూడా చెప్పగా షారుఖ్ కూడా రిప్లై ఇచ్చాడు. తాజాగా మహేష్ బాబు సినిమా చూసి.. బ్లాక్ బస్టర్ సినిమా జవాన్. కింగ్ తో అట్లీ కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ కెరీర్ బెస్ట్ ఫిలిం ఇది. షారుఖ్ ఆరా, స్క్రీన్ ప్రెజెన్స్ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. షారుఖ్ మంచి ఫైర్ మీద ఉన్నాడు. జవాన్ సినిమా షారుఖ్ సొంత సినిమా రికార్డులనే బద్దలు కొడుతుంది. లెజెండ్ అని పొగుడుతూ పోస్ట్ చేశాడు. దీంతో మహేష్ బాబు షారుఖ్ జవాన్ సినిమా గురించి ఈ రేంజ్ లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.