పూరీ.. ఐ యామ్ సారీ : మహేష్ ట్వీట్
పోకిరి, బిజినెస్ మెన్ లాంటి హిట్స్ ఇచ్చిన పూరీని ఎలా మర్చిపోతావ్? అంటూ మహేష్‌ని నిలదీసారు నెటిజన్లు..

పోకిరి, బిజినెస్ మెన్ లాంటి హిట్స్ ఇచ్చిన పూరీని ఎలా మర్చిపోతావ్? అంటూ మహేష్‌ని నిలదీసారు నెటిజన్లు..
సినిమాలకు సంబంధించి పబ్లిక్ ఫంక్షన్లో మాట్లేడప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. పొరపాటున ఏదైనా పొరపాటు జరిగిందంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలూగా ఉండదు. ఇలా చేసినందుకు గానూ రీసెంట్గా మహేష్ బాబుకి సోషల్ మీడియాలో సెగ తగిలింది. అసలేం జరిగిందంటే, మహేష్ బాబు 25వ సినిమా, మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని, పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా జరిగింది.
Also Read : శేఖర్ కమ్ముల న్యూ మూవీ అప్డేట్!
ఈ ఫంక్షన్లో మహేష్ మాట్లాడుతూ.. తనని హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్రరావుతో మొదలుపెట్టి, కృష్ణవంశీ, గుణ శేఖర్, త్రివిక్రమ్, శ్రీనువైట్ల, కొరటాల శివ తదితరులకు పేరు పేరునా థ్యాంక్స్ చెప్పాడు.. తనకి పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ పేరు మాత్రం చెప్పలేదు. సుకుమార్, తేజతో సహా మరికొంతమంది పేర్లు కూడా చెప్పలేదు. ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. పోకిరి, బిజినెస్ మెన్ లాంటి హిట్స్ ఇచ్చిన పూరీని ఎలా మర్చిపోతావ్? అంటూ మహేష్‌ని నిలదీశారు.
Also Read : మహర్షి ట్రైలర్ : ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నా
వెంటనే స్పందించిన మహేష్ ట్విట్టర్ వేదికగా పూరీకి క్షమాపణ చెప్పాడు. ‘ఇవాళ నా స్పీచ్‌లో ఇంపార్టెంట్ పర్సన్ పేరు చెప్పడం మర్చిపోయాను. పోకిరి నన్ను సూపర్ స్టార్‌ని చేసింది. పోకిరిలాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్యూ సో మచ్ పూరీ.. ఈ సినిమా నాకెప్పటికీ గుర్తుండిపోతుంది’ అని ట్వీట్ చేసాడు మహేష్.. ‘థ్యాంక్యూ సో మచ్ సార్, ఆల్వేస్ లవ్ యూ, మహర్షి ట్రైలర్ ఈజ్ రాకింగ్’.. అంటూ, మహేష్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు పూరీ జగన్నాథ్.
Missed mentioning an important person in my speech today. In my 25 films journey, it was #Pokiri that made me a Superstar. Thank you so much @purijagan !!! Thanks for giving me Pokiri ? A film that will always be remembered.
— Mahesh Babu (@urstrulyMahesh) May 1, 2019