Maruthi Changes Plan For Prabhas: ప్రభాస్ కోసం ప్లాన్ మార్చిన మారుతి..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K వంటి సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ తరువాత కూడా కొన్ని ప్రాజెక్టులను ఓకే చేశాడు. ఈ క్రమంలో సక్సెస్ చిత్రాల దర్శకుడు మారుతితో కూడా ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని ఇటీవల వార్తలు వస్తున్నాయి.

Maruthi Changes Plan For Prabhas: ప్రభాస్ కోసం ప్లాన్ మార్చిన మారుతి..?

Maruthi Changes Plan For Prabhas Movie

Updated On : August 30, 2022 / 9:21 PM IST

Maruthi Changes Plan For Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K వంటి సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ తరువాత కూడా కొన్ని ప్రాజెక్టులను ఓకే చేశాడు. ఈ క్రమంలో సక్సెస్ చిత్రాల దర్శకుడు మారుతితో కూడా ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని ఇటీవల వార్తలు వస్తున్నాయి.

Prabhas Maruthi Movie Launched: మారుతితో సైలెంట్‌గా మొదలుపెట్టిన ప్రభాస్

అయితే దర్శకుడు మారుతి ఇటీవల పక్కా కమర్షియల్ అనే సినిమాతో ఫ్లాప్‌ను అందుకున్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మారుతితో తమ అభిమాన హీరో సినిమా చేయొద్దంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. కానీ.. ప్రభాస్ కోసం మారుతి ఈసారి తన ప్లానింగ్ మార్చేశాడట. ఇప్పటివరకు తన సినిమాలకు స్క్రిప్టు విషయంలో వేరొక రైటర్‌కు చోటివ్వని మారుతి, ప్రభాస్ మూవీ కోసం ఏకంగా ఓ టీమ్‌తోనే పనిచేస్తున్నాడట.

Prabhas: ప్రభాస్ కోసం ఆమెను పట్టుకొస్తున్నారా..?

తన రైటర్స్ టీమ్‌తో స్క్రిప్టు పనుల్లో ప్రస్తుతం మారుతి ఫుల్ బిజీగా ఉన్నాడట. ఇక ఈ రైటర్స్ టీమ్‌ను వాసు వర్మ లీడ్ చేస్తుండటం విశేషం. ఏదేమైనా మారుతిపై ప్రభాస్‌కు పూర్తి కాన్ఫిడెన్స్ ఉండటంతో తమ సినిమా కోసం పర్ఫెక్ట్ స్క్రిప్టును రెడీ చేయాల్సిందిగా ప్రభాస్ కోరాడట. అటు మారుతి కూడా తనకు కావాల్సినంత సమయాన్ని స్క్రిప్టు పనులకు కేటాయిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా మాళవికా మోహనన్ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది. మరి ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.