Chiranjeevi : ఆ విష‌యం తెలిసి ఎంతో బాధ‌ప‌డ్డా.. శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం కావాలి : చిరంజీవి

Chiranjeevi - KCR : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర్ రావు గాయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

Chiranjeevi : ఆ విష‌యం తెలిసి ఎంతో బాధ‌ప‌డ్డా.. శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం కావాలి : చిరంజీవి

KCR - Chiranjeevi

Updated On : December 10, 2023 / 1:48 PM IST

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర్ రావు గాయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయ‌న‌ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. కేసీఆర్ కు గాయ‌మైంద‌న్న విష‌యం తెలిసి చాలా బాధ‌ప‌డిన‌ట్లు చెప్పారు. ఆయ‌న‌కు జ‌రిగే శ‌స్త్ర చికిత్స విజ‌యవంతమై త్వ‌ర‌గా కోలుకోవాల‌ని చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరుకున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

కేసీఆర్ త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో గురువారం బాత్‌రూమ్‌లో జారి ప‌డ్డారు. నొప్పి ఎక్కువ‌గా ఉండ‌డంతో హైద‌రాబాద్‌లోని య‌శోదా ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఆస్ప‌త్రిలో చికిత్స కొన‌సాగుతోంది. కాగా.. ఇప్ప‌టికే కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితి ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఓ బులిటెన్‌ను విడుద‌ల చేశాయి. కేసీఆర్ ఎడ‌మ తుంటి విరిగింద‌ని, కోలుకోవ‌డానికి ఆరు నుంచి ఎనిమిది వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని వెల్ల‌డించింది. కేసీఆర్ కు స‌ర్జ‌రీ చేయాల్సి ఉంద‌న్నారు.

Also Read : నీటిపై బన్నీ బొమ్మ.. వైరల్ అవుతున్న ఆర్టిస్ట్ టాలెంట్

ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం బింబిసార ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లో 156వ చిత్రంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ మూవీకి విశ్వంభ‌ర అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. ప్రస్తుతం షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్ర కథ మొత్తం పంచభూతాలు చుట్టూ తిరగనుందట. ఈ మూవీకి చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Bigg Boss 7 : ఆడపిల్లవి అడ్వాంటేజ్ తీసుకోవద్దు.. శోభాశెట్టిపై శివాజీ ఫైర్‌