Movie Promotions: మళ్ళీ స్టార్ట్.. ప్రమోషన్స్ బరిలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్!
మరోసారి సందడి షురూ అంటున్నారు రాధేశ్యామ్, ట్రిపుల్ ఆర్ మేకర్స్. సంక్రాంతికి సినిమాను ప్రకటించి ప్రమోషన్ హవా చూపించిన జక్కన్న.. మార్చ్ 1 నుంచి కొత్తగా మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నాడు.

Movie Promotions
Movie Promotions: మరోసారి సందడి షురూ అంటున్నారు రాధేశ్యామ్, ట్రిపుల్ ఆర్ మేకర్స్. సంక్రాంతికి సినిమాను ప్రకటించి ప్రమోషన్ హవా చూపించిన జక్కన్న.. మార్చ్ 1 నుంచి కొత్తగా మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నాడు. రాధేశ్యామ్ మాత్రం తనదైన స్టైల్ లోనే రాబోతున్నాడు. ఏదేమైనా భీమ్లానాయక్ హడావిడీ తగ్గితే.. వాళ్ల ప్రమోషన్స్ తో పాన్ ఇండియా మూవీ మేకర్స్ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తామంటున్నారు.
RRR: దుబాయ్‌లో ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా హాలీవుడ్ యాక్షన్ హీరో?
మరోసారి ప్రమోషన్ మెటీరియల్ తో రాబోతున్నాయి ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్. సంక్రాంతి సీజన్ ను ఫిక్స్ చేసుకుని ప్రీరిలీజ్ ఫంక్షన్స్, మీడియా మీట్స్ తో రెచ్చిపోయాడు జక్కన్న. ఇక ఫ్యాన్స్ వెంటాడి వేటాడి రాధేశ్యామ్ నుంచి కూడా ఆమధ్య కాస్త ప్రమోషనల్ స్టఫ్ రాబట్టుకున్నారు. కానీ వాయిదాలతో ఆ కథ కంచికి చేరింది. ఇప్పుడు కొత్త డేట్స్ ను ఫిక్స్ చేసుకొన్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మేకర్స్ మరింత కొత్తగా బజ్ క్రియేట్ చేస్తామంటున్నారు.
RRR: 50 రోజుల్లో ఆర్ఆర్ఆర్.. పోస్టర్ తో కౌన్ డౌన్ స్టార్ట్!
మార్చ్ 11న పాన్ ఇండియాను టార్గెట్ చేయబోతుంది ప్రభాస్ రాధేశ్యామ్. రిలీజ్ కి పెద్దగా గ్యాప్ లేదు కాబట్టి.. కాస్త హైప్ పెంచడయ్యా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇక యాక్టివ్ గా ఉండాల్సిన టైమ్ వచ్చిందనకున్న రాధేశ్యామ్ మేకర్స్ అలర్టయ్యారు. జాన్ హై మేరీ అంటూ సాగే ప్రోమో సాంగ్ ను తీసుకొస్తున్నారు. ఆపై మరో టీజర్ తో పాటూ రెండో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మార్చ్ ఫస్ట్ వీక్ లో ఓ భారీ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేసింది యూవీ క్రియేషన్స్.
Radhe Shyam: ఈ రాతలే వీడియో సాంగ్.. విజువల్ ట్రీట్ ఇచ్చిన రొమాంటిక్ లవ్ ట్రాక్!
పబ్లిసిటీకి మించిన బలమైన వెపన్ లేదని నమ్మే రాజమౌళి ఇప్పుడా పనుల్లోనే ఉన్నారు. మార్చ్ 25న రాబోతున్న ఆర్ఆర్ఆర్ ను కొత్తగా మళ్లీ ప్రమోట్ చేసేందుకు స్కెచ్ గీస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో జరిపేందుకు సన్నాహాలు చేసినట్టు చెప్తున్నారు. ఆర్ఆర్ఆర్ బ్రాండింగ్ తో కొన్ని కార్పోరేట్ సంస్థలు యాడ్స్ రిలీజ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే మళ్లీ ఇండియాలోని ఇంపార్టెంట్ సిటీస్ అన్నింటిలో చరణ్, తారక్ కలిసి సందడి చేయబోతున్నారు.