Murali Mohan : నంది అవార్డులపై మురళి మోహన్ సంచలన వ్యాఖ్యలు
ఈ అవార్డుల వేడుకలో మురళి మోహన్ మాట్లాడుతూ.. ''సినీనటులకు అవార్డులు ఆక్సిజన్ లాంటివి. నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని రెండు ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. ఏడేళ్ల నుంచి నంది.............

Nandi Awards
Nandi Awards : తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో నంది అవార్డులని పక్కన పెట్టేశాయి రెండు ప్రభుత్వాలు. దీనిపై టాలీవుడ్ పెద్దలు అనేక సార్లు రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. టాలీవుడ్ ప్రముఖులు ఏదో ఒక సందర్భంలో నంది అవార్డుల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభుత్వం తరపున అవార్డులు ఇవ్వాలని, కళాకారులని ప్రోత్సహించాలని కోరుతున్నారు. తాజాగా ఓ వేడుకలో సీనియర్ నటులు మురళి మోహన్ కూడా నంది అవార్డుల గురించి మాట్లాడారు.
Varun Tej : బాబాయ్ ‘తమ్ముడు’ సినిమా చూసి ఫిక్స్ అయ్యాను..
నిన్న ఉగాది సందర్భంగా నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 24 విభాగాలకు చెందిన సినీ ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందచేశారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం, మురళీమోహన్, సి.కళ్యాణ్ ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఈ అవార్డుల వేడుక ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ అవార్డుల వేడుకలో మురళి మోహన్ మాట్లాడుతూ.. ”సినీనటులకు అవార్డులు ఆక్సిజన్ లాంటివి. నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని రెండు ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. ఏడేళ్ల నుంచి నంది అవార్డులు ఇవ్వడం లేదు. పలు ప్రైవేటు సంస్థలు నటీనటులకు అవార్డులు ఇస్తున్నాయి. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు నంది అవార్డుల గురించి ఆలోచించాలి” అని తెలిపారు.