Mutton Soup Teaser : ‘మటన్ సూప్’ టీజర్ రిలీజ్.. కాల్ మనీ బ్యాక్ డ్రాప్ లో..

దసరా సందర్భంగా బుధవారం నేడు మటన్ సూప్ టీజర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. (Mutton Soup Teaser)

Mutton Soup Teaser : ‘మటన్ సూప్’ టీజర్ రిలీజ్.. కాల్ మనీ బ్యాక్ డ్రాప్ లో..

Mutton Soup Teaser

Updated On : October 1, 2025 / 4:45 PM IST

Mutton Soup Teaser : రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ జంటగా రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌’ అనేది ట్యాగ్ లైన్‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

తాజాగా దసరా సందర్భంగా బుధవారం నేడు మటన్ సూప్ టీజర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. మటన్ సూప్ టీజర్ మీరు కూడా చూసేయండి..

టీజర్ లాంచ్ అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. మటన్ సూప్ టైటిల్ చాలా బాగుంది. టీం కూడా చాలా కొత్తగా ఉంది. టీజర్ బాగుంది. అక్టోబర్ 10న వస్తున్న ఈ సినిమాకు అల్ ది బెస్ట్ అని తెలిపారు. నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి స్క్రీన్ ప్లేతో రాబోతోంది అని అన్నారు.

Also Read : Allu Sirish : ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్న అల్లు శిరీష్.. ఈఫిల్ టవర్ నుంచి అనౌన్స్..

దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ.. క్రమశిక్షణకు, నిబద్దతకు మారు పేరు అయిన సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మా టీజర్‌ను లాంఛ్ చేయడం మా అదృష్టం. అందరూ గొప్పగా నటించారు. మా అందరినీ ముందుండి నడిపిస్తున్న పర్వతనేని రాంబాబు గారికి ధన్యవాదాలు అని అన్నారు. నిర్మాతలు రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి మాట్లాడుతూ.. మా మటన్ సూప్ ట్రెండ్‌కు తగ్గ కథ. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. అక్టోబర్ 10న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

Mutton Soup Teaser Released by Anil Ravipudi

హీరో రమణ్ మాట్లాడుతూ.. మటన్ సూప్ టీజర్‌ చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. దర్శక నిర్మాతలు ఎంతగానో కష్టపడ్డారు అని అన్నారు.