Nag Ashwin – Rajamouli : నాగ్ అశ్విన్ రాజమౌళిని రీచ్ అయ్యాడా..? రీప్లేస్ చేస్తాడా..?

రాజమౌళిని ఎవరైనా రీచ్ అవుతారా అన్న ఆలోచన కూడా రాలేదు మొన్నటి వరకూ. అయితే రీచ్ అవ్వడం కాదు ఏకంగా మరో రాజమౌళి అనేలా రికార్డులు సెట్ చేస్తున్నారు నాగ అశ్విన్.

Nag Ashwin – Rajamouli : నాగ్ అశ్విన్ రాజమౌళిని రీచ్ అయ్యాడా..? రీప్లేస్ చేస్తాడా..?

Nag Ashwin reached Rajamouli Place or Cross his Records New Trend

Nag Ashwin – Rajamouli : తెలుగు సినిమాని వరల్డ్ వైడ్ గా ఫేమస్ చేసి, ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూఎవరూ బ్రేక్ చెయ్యలేని కలెక్షన్ల రికార్డులు సృష్టించి, ఫేస్ ఆఫ్ ద ఇండియన్ సినిమాగా ఇప్పటి వరకూ ఉన్న రాజమౌళిని ఎవరైనా రీచ్ అవుతారా అన్న ఆలోచన కూడా రాలేదు మొన్నటి వరకూ. అయితే రీచ్ అవ్వడం కాదు ఏకంగా మరో రాజమౌళి అనేలా రికార్డులు సెట్ చేస్తున్నారు నాగ అశ్విన్.

గ్రాండియర్ కా బాప్, రికార్డుల కేరాఫ్ అడ్రస్, రీచింగ్ లో తోప్, ప్రమోషన్స్ లో పీక్స్.. ఇలా రాజమౌళికి రకరకాల బ్రాండింగ్స్ ఉన్నాయి. ఇండియన్ సినిమాని గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ చేసి, తెలుగు సినిమాకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టిన రాజమౌళికి పోటీ రాబోతోందని ఇప్పటి వరకూఎవ్వరూ అనుకోలేదు. కానీ ఆ టైమ్ వచ్చిందంటున్నారు ఆడియన్స్. రాజమౌళిని రీప్లేస్ చెయ్యకపోయినా నాగ్ అశ్విన్ నెక్ట్స్ రాజమౌళి అంటున్నారు.

Also Read : Prabhas Marriage : ప్రభాస్ పెళ్లిపై ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్.. ఆ నమ్మకంతోనే..

ఒక్క సినిమా చెయ్యాలంటే మినిమం 3 సంవత్సరాలు టైమ్ తీసుకుంటారు, ఎక్కడెక్కడినుంచో స్టార్ కాస్ట్ ని రిక్రూట్ చేస్తారు, నెవర్ సీన్ లొకేషన్స్ లో షూట్ చేస్తారు, అసలు ఎవరికీ అందని స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తారు, విజువల్ గ్రాండియర్, గ్రాఫిక్స్ తో జనాల్ని సర్ ప్రైజ్ చేస్తారు. ఒకప్పుడు ఇవన్నీ రాజమౌళికి మాత్రమే సొంతం. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా ఇదే బాటలో వెళుతున్నాడు. 600కోట్ల బడ్జెట్, ఆల్ ఓవర్ ఇండియా స్టార్ కాస్ట్. నిజానికి ఇప్పటి వరకూ ఇంత పెద్ద స్టార్ కాస్ట్ తో ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కాలేదు. దాదాపు 3 ఏళ్ల షూటింగ్, హాలీవుడ్ రేంజ్ విజువల్స్, స్పెషల్లీ సీక్వెల్స్, చాలా మంది స్టార్స్ స్పెషల్ రోల్స్.. ఇలా కల్కితో ఆడియన్స్ కి సరికొత్త ఫీల్ ఇచ్చారు నాగ్ అశ్విన్.

Also Read : Darling Trailer : ‘డార్లింగ్’ ట్రైలర్ రిలీజ్.. పెళ్లి చేసుకొని భార్యతో ప్రియదర్శి కష్టాలు చూడండి..

బాహుబలితో 2 వేల కోట్ల కలెక్షన్లు సాధించినా, ట్రిపుల్ ఆర్ తో హాలీవుడ్ ని సైతం ఇంప్రెస్ చేసి ఆస్కార్ అవార్డు అందుకున్నా రాజమౌళికే సొంతం. అయితే కల్కితో ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్లతో పాటు RRR రికార్డులని లేపేసి, బాలీవుడ్ లో సరికొత్త కలెక్షన్ల రికార్డులు సెట్ చేసిన క్రెడిట్ నాగ్ అశ్విన్ దే. ప్రభాస్ తో బాహుబలి తీసి రాజమౌళి ఎన్ని రికార్డులు సెట్ చేశారో, అదే ప్రభాస్ తో కల్కి తీసి నాగ అశ్విన్ కూడా సరికొత్త రికార్డులు సెట్ చేస్తున్నారు. కల్కితో మరో ప్రపంచాన్ని సృష్టించి, నెవర్ బిఫోర్ స్టోరీని ఆడియన్స్ ముందుంచి 800కోట్లకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ ని కల్కి తో రూల్ చేయిస్తున్నాడు నాగి. అందుకే నాగాశ్విన్ మరో రాజమౌళి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి ముందు ముందు నాగి ఇంకెన్ని ఇంట్రస్టింగ్ మూవీస్ చేస్తారో, కల్కి పార్ట్ 2లో ఇంకెన్ని అద్భుతాలు చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.