Naga Chaitanya : తాత, నాన్నతో కలిసి చేసిన సినిమా కాదు.. సమంతతో చేసిన సినిమానే ఫెవరెట్!

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునతో కలిసి చేసిన మనం సినిమా కన్నా సమంతతో చేసిన ఆ సినిమానే తన ఫెవరెట్ అంటున్న నాగచైతన్య.

Naga Chaitanya : తాత, నాన్నతో కలిసి చేసిన సినిమా కాదు.. సమంతతో చేసిన సినిమానే ఫెవరెట్!

Naga Chaitanya favourite movie is Samantha Ye Maaya Chesave

Updated On : May 11, 2023 / 2:52 PM IST

Naga Chaitanya : నాగచైతన్య నటించిన బై లింగువల్ మూవీ కస్టడీ (Custody) రేపు (మే 12) రిలీజ్ కానుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న చైతన్య.. మూవీ విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే తన విడాకుల విషయం గురించి మొదటిసారి పూర్తిగా ఓపెన్ అయ్యి కామెంట్స్ చేస్తున్నాడు. “సోషల్ మీడియా వలనే వారిద్దరూ విడిపోవాల్సి వచ్చిందని, సమంత (Samantha) చాలా మంచి అమ్మాయి అని, ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండాలంటూ” చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

Naga Chaitanya – Samantha : ఆ సిరీస్‌తోనే విడిపోయారు అంటూ రూమర్స్.. కానీ అదే ఇష్టమంటున్న నాగచైతన్య!

ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలను తెలియజేశాడు. తను చేసిన సినిమాల్లో తనకి బాగా నచ్చిన సినిమా ఏదని నాగచైతన్యని ప్రశ్నించగా.. మొదటిగా ‘ఏమాయ చేసావే’ అని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత మనం, ప్రేమమ్, మజిలీ, లవ్ స్టోరీ చిత్రాలని చెప్పుకొచ్చాడు. తాత, నాన్నతో కలిసి చేసిన మనం సినిమా కన్నా సమంతతో చేసిన ఏమాయ చేసావే సినిమానే ఫెవరెట్ అనడంతో సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక తన సినిమాల్లో తనకి నచ్చని సినిమా ‘బెజవాడ’ చిత్రమని చెప్పుకొచ్చాడు.

Naga Chaitanya : ఆ విషయంలో మా నాన్న తప్పేమి లేదు.. నాగార్జున పై నాగచైతన్య కామెంట్స్!

అలాగే కస్టడీ సినిమాలో తనని చాలా ఇబ్బందికి గురి చేసిన సీన్.. అరవింద్ స్వామితో సన్నివేశామని చెప్పుకొచ్చాడు. ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ఆ సీన్ కొంచెం సస్పెన్స్ గా ఉంటుంది. అదీ కాకుండా ఆ సీన్ ని షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్ లో చిత్రీకరించారు. దీంతో అరవింద్ స్వామి వంటి స్టార్ తో నటించాలనే ఒక చిన్న భయం ఉండడంతో చాలా ఇబ్బంది ఫీల్ అయ్యినట్లు వెల్లడించాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తుంది.