Naga Chaitanya : చివరికి చైతూనే ఫిక్స్ అయ్యాడుగా..!

‘మజిలీ’ వంటి సూపర్ హిట్ తర్వాత యువసామ్రాట్ నాగ చైతన్య - శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఓ లవ్ స్టోరీ రాబోతోంది..

Naga Chaitanya : చివరికి చైతూనే ఫిక్స్ అయ్యాడుగా..!

Shiva Nirvana

Updated On : September 28, 2021 / 4:18 PM IST

Naga Chaitanya: ‘లవ్ స్టోరీ’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. పాండమిక్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసి.. ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతుంది ‘లవ్ స్టోరీ’. ముఖ్యంగా పరిణితి చెందిన నటుడిగా చైతు పర్ఫార్మెన్స్‌కి మంచి అప్లాజ్ వస్తోంది.

Love Story Magical Success Meet : నాగార్జున – సుకుమార్ అతిథులుగా..

తర్వాత విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ మూవీ చేస్తున్నాడు. ఆమిర్ ఖాన్‌తో నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కూడా ఇటీవలే కంప్లీట్ అయింది. ఇంతలో నాన్నతో నటించబోయే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ కి కొబ్బరికాయ కొట్టేశాడు. తర్వాత ‘నాంది’ డైరెక్టర్ విజయ్ కనకమేడల.. మోహన కృష్ణ ఇంద్రగంటితో సినిమాలు చెయ్యబోతున్నాడని టాక్స్ వినిపించాయి.

Love Story : సరైన టైంలో సాలిడ్ హిట్ కొట్టిన చైతూ

కట్ చేస్తే.. చైతు కొత్త సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. చై, సమంత కెరీర్‌లో మెమరబుల్ హిట్‌గా నిలిచిన సినిమా ‘మజిలీ’. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మంచి ప్రశంసలు లభించాయి. దిల్ రాజు నిర్మాతగా శివ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా అనుకున్నారు.

Love Story : పవన్‌ను ప్రశంసిస్తూ మహేష్ ట్వీట్.. రిప్లై ఇచ్చిన రెహమాన్..

అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో చైతు – శివ నిర్వాణ కాంబినేషన్ సెట్ చేసింది టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. బీబ్‌లో కూర్చుని స్క్రిప్ట్ రాసుకుంటూ.. నెక్స్ట్ ప్రేమ కథతో సినిమా చెయ్యబోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శివ నిర్వాణ. త్వరలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.