Naga Chaitanya : నా క్రష్ విషయంలో ఎటువంటి సీక్రెట్ లేదు.. ఆమె పేరు చెప్పేసిన నాగచైతన్య!

నాగచైతన్య, శోభిత ధూళిపాళ ప్రేమ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైతన్య తన క్రష్ ఆమె అంటూ చెప్పుకొచ్చాడు.

Naga Chaitanya : నా క్రష్ విషయంలో ఎటువంటి సీక్రెట్ లేదు.. ఆమె పేరు చెప్పేసిన నాగచైతన్య!

Naga Chaitanya says Margot Robbie is his biggest crush

Updated On : May 2, 2023 / 7:22 PM IST

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో (Sobhita Dhulipala) సీక్రెట్ రేలషన్ మెయిన్‌టైన్ చేస్తున్నాడు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి ఉన్న పిక్ బయటకి రావడం ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యిపోయింది. నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ (Custody) మూవీ ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న చైతన్య.. తాజాగా తన క్రష్ ఎవరు అన్నది బయట పెట్టేశాడు.

Naga Chaitanya : ఆ విషయంలో మాత్రం కొన్ని సార్లు బాధపడ్డాను..

నాగచైతన్య మాట్లాడుతూ.. “నా క్రష్ విషయంలో ఎటువంటి సీక్రెట్ లేదు. హాలీవుడ్ యాక్ట్రెస్ మార్గట్‌ రోబీ (Margot Robbie) పై నాకు చాలా క్రష్ ఉంది. రీసెంట్ గా ఆమె నటించిన బేబీలాన్ (Babylon) సినిమా చూశాను. ఆ మూవీలో తన నతనికి నేను ఫిదా అయ్యిపోయాను. ఆమె పర్ఫెర్మెన్స్ పై, తన పై నాకు భారీ క్రష్ ఏర్పడింది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మరో ఇంటర్వ్యూలో తన జీవితంలో పశ్చాత్తాపపడ్డ సంఘటనని షేర్ చేసుకున్నాడు.

Samantha : కొనసాగుతున్న మయోసైటిస్ ట్రీట్మెంట్.. నరకంగా ఉందంటున్న సమంత!

పర్సనల్ లైఫ్ లో పెద్దగా పశ్చాత్తాపపడ్డ సంఘటనలు ఏమి లేవు గాని ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం అలా ఫీల్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. మూడు సినిమాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోయానని పశ్చాత్తాప పడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా కస్టడీ సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్ గా ఈ మూవీ తెరకెక్కింది. కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అరవింద్ స్వామి విలన్ గా చేశాడు. మే 12న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.