Naga Chaitanya : చాన్నాళ్ల తర్వాత.. పెళ్ళికి ముందు రేసింగ్ కార్‌తో స్పెషల్ ఫోటో షేర్ చేసిన నాగచైతన్య
కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య.

Naga Chaitanya with racing car pic viral
Naga Chaitanya : కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య. తనదైన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన తండేల్ మూవీలో నటిస్తున్నాడు. చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగచైతన్య తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఓ స్పోర్ట్స్ కార్‌తో ఉన్న ఫోటోను చేశాడు. ఈ పిక్‌లో కారు డ్రైవర్ సీటు వైపు డోర్ తెరిచి ఉండగా.. హెల్మెట్ ధరించిన చైతు దాని వైపు చూస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారింది.
చైతు కు స్పోర్ట్స్ కార్స్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. గత కొన్నాళ్లుగా ఆయన వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్టు చేయడం లేదు. కాగా.. శోభిత ధూళిపాళ్లని త్వరలోనే చైతు పెళ్లిచేసుకోనున్నాడు. ఆగస్టు 8న వీరిద్దరి నిశ్చితార్థం జరుగగా.. ఇప్పటికే పెళ్లి పనులు సైతం మొదలు అయ్యాయి. ఈ క్రమంలో చై స్టోర్ట్స్ కారుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Anchor Lasya : భర్తతో కలిసి వేములవాడ రాజన్న దర్శనం చేసుకున్న యాంకర్ లాస్య.. ఫొటోలు వైరల్..
View this post on Instagram