జైసింహా కాంబో రిపీట్
బోయపాటి కంటే ముందు, జైసింహా దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌తో తన తర్వాతి సినిమాని చెయ్యబోతున్నాడు..

బోయపాటి కంటే ముందు, జైసింహా దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌తో తన తర్వాతి సినిమాని చెయ్యబోతున్నాడు..
ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు తర్వాత.. నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందనుందనే సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకపై బోయపాటి ఈ విషయాన్ని కన్‌ఫమ్ చేసాడు కూడా.. కట్ చేస్తే బాలయ్య ఇంతలో ఫ్యాన్స్‌కి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. బోయపాటి కంటే ముందు, జైసింహా దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌తో తన తర్వాతి సినిమాని చెయ్యబోతున్నాడు. జైసింహా నిర్మాత సి.కళ్యాణే ఈసినిమాకీ నిర్మాత.. ముందుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఇదే బ్యానర్‌లో బాలయ్య సినిమా చెయ్యాలి.. వినాయక్ చెప్పిన కథ నచ్చకపోవడంతో సి.కళ్యాణ్, కె.ఎస్.రవికుమార్‌ని రంగంలోకి దింపాడు.
కన్నడ కంఠీరవ, స్వర్గీయ రాజ్ కుమార్ తనయుడు, బాలయ్యకు అత్యంత ఆప్తుడు శివ రాజ్‌కుమార్ నటించగా కన్నడలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాకిది రీమేక్ అని తెలుస్తుంది. బాలయ్యకిది 105వ సినిమా. మే నెలలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి, జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, ఆగష్ట్ వరకు ఫినిష్ చేసి, అక్టోబర్‌లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. జైసింహా కాంబినేషన్ రిపీట్ అనగానే అభిమానులు మరో మాస్ బొమ్మ పక్కా అంటూ హ్యాపీగా ఫీలవుతున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. బోయపాటి సినిమా ఆగష్టు నుండి స్టార్ట్ అవనుంది.
వాచ్, అమ్మకుట్టి సాంగ్..