Hi Nanna : నాని ‘హాయ్ నాన్న’ అంటూ అక్టోబర్‌లోనే పలకరించబోతున్నాడా.. పోస్ట్ వైరల్..!
‘హాయ్ నాన్న’తో నాని అక్టోబర్‌లోనే పలకరించబోతున్నాడా..? నాని న్యూ పోస్ట్ వైరల్.

Nani Hi Nanna movie is pre poned to october post viral
Hi Nanna : నేచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ అనే ఎమోషనల్ డ్రామా మూవీలో నటిస్తున్నాడు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 21న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే ఈ ఇప్పుడు ఈ మూవీ పోస్టుపోన్ కి సిద్దమైందంటూ వార్తలు వస్తున్నాయి.
Allu Business Park : అల్లు బిజినెస్ పార్క్ లాంచ్.. ముని మనవడితో రామలింగయ్య విగ్రహావిష్కరణ..
ప్రభాస్ సలార్ డిసెంబర్ కి వెళ్లడంతో.. ఆల్రెడీ ఆ సమయంలో రిలీజ్ కి ఉన్న సినిమాలో ముందుకు వెనక్కి వెళ్తున్నాయి. ఈక్రమంలోనే వెంకటేష్ ‘సైంధవ్’ వెనక్కి తగ్గి సంక్రాంతికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక నాని ‘హాయ్ నాన్న’ ముందుకు వచ్చేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో డిసెంబర్ ఫస్ట్ హాఫ్, లేదా నవంబర్ లో వస్తాడని అందరు భావించారు. అయితే తాజాగా నాని చేసిన ఒక పోస్ట్.. అక్టోబర్ లోనే రాబోతున్నాడా..? అనే సందేహాన్ని కలిగిస్తుంది. నాని తన ఇన్‌స్టాగ్రామ్ లో ‘హాయ్ అక్టోబర్’ అంటూ ఒక పోస్ట్ వేశాడు.
Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు కోసం చంటిబిడ్డను ఎత్తుకున్న రేణు దేశాయ్
View this post on Instagram
మరి ఈ పోస్ట్ వెనుక నాని అంతరార్థం ఏంటో తెలియాలంటే ఒక క్లారిటీ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కాగా అక్టోబర్ లో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో, ఘోస్ట్, గణపథ్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రాలు అన్ని అక్టోబర్ మూడో వారంలో ఆడియన్స్ ముందు వచ్చేస్తున్నాయి. దీంతో అక్టోబర్ నాలుగో వారం ఖాళీగానే ఉంది. ఒకవేళ నాని హాయ్ నాన్నని తీసుకువస్తే ఆ సమయంలోనే కొంచెం బెటర్. నవంబర్ లో కూడా పెద్దగా సినిమాలు ఏమి లేవు. కాబట్టి నానికి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ‘హాయ్ నాన్న’ పలకరిస్తాడో.