జెర్సీ షూట్‌లో నాని ముక్కుకి గాయం
జెర్సీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

జెర్సీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది.
నేచురల్ స్టార్ నాని, మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో చేస్తున్న మూవీ, జెర్సీ.. పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నాని, అర్జున్ అనే క్రికెటర్‌గా కనిపించబోతున్నాడు. శ్రద్ధ శ్రీనాధ్, రెబా మోనికా జాన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌లో నాని గాయ పడ్డాడు. జెర్సీ సెట్‌లో నాని ముక్కుకి గాయం అయినట్టు మూవీ యూనిట్ తెలిపింది. షూటింగ్‌లో నాని ముక్కుకి మేజర్ ఇంజూరీ అయ్యింది. అయినా ఎటువంటి బ్రేక్ తీసుకోకుండా వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నాడు అని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాలో నాని, వయసు మీద పడుతున్నా, తను అనుకున్న గోల్‌ని రీచ్ అయ్యే ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు..
ఈ మధ్య రిలీజ్ చేసిన జెర్సీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న జెర్సీ, ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా, లిరిక్స్ : కృష్ణకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వెంకటరత్నం (వెంకట్).
వాచ్ జెర్సీ టీజర్…