Nayanthara: కింగ్‌ఖాన్‌కు జోడీగా.. బాలీవుడ్‌లోకి నయన్!

మన దేశంలో టాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా దాదాపుగా హీరోయిన్స్ అందరికీ ఒకటే కోరిక ఉంటుంది. బీటౌన్ లో స్థిరపడి.. బాలీవుడ్ స్టార్ హీరొయిన్ కావాలనే అందరికీ కోరిక. దక్షణాది నుండి ఇప్పటికే అలా ఎందరో ముంబై చేరి స్టార్స్ గా వెలిగిపోతే మరికొందరు ఇప్పటికీ హిందీ పరిశ్రమను ఏలేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళలో కూడా కాజల్, తమన్నా లాంటి వాళ్ళు కూడా అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా..

Nayanthara: కింగ్‌ఖాన్‌కు జోడీగా.. బాలీవుడ్‌లోకి నయన్!

Nayanthara To Be Opposite Shah Rukh Khan In Atlees Directorial Film

Updated On : June 26, 2021 / 11:28 AM IST

Nayanthara: మన దేశంలో టాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా దాదాపుగా హీరోయిన్స్ అందరికీ ఒకటే కోరిక ఉంటుంది. బీటౌన్ లో స్థిరపడి.. బాలీవుడ్ స్టార్ హీరొయిన్ కావాలనే అందరికీ కోరిక. దక్షణాది నుండి ఇప్పటికే అలా ఎందరో ముంబై చేరి స్టార్స్ గా వెలిగిపోతే మరికొందరు ఇప్పటికీ హిందీ పరిశ్రమను ఏలేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళలో కూడా కాజల్, తమన్నా లాంటి వాళ్ళు కూడా అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. నయనతార మాత్రం ఇప్పటి వరకు ఆ సాహసం చేయలేదు.

అయితే, ఇప్పుడు తొలిసారి బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. తమిళ యంగ్ దర్శకుడు అట్లీ త్వరలోనే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం నయనతారను ఫైనల్ చేసినట్లుగా తమిళ సినీ ఇండస్ట్రీ కోడైకూస్తోంది. అట్లీతో నయన్ గతంలో రాజారాణి, బిగిల్ సినిమాలు చేయగా ఆ అనుబంధంతోనే ఆమెని సంప్రదించినట్లు తెలుస్తుంది. అసలే ఇప్పుడు నయనకు ఇక్కడ లేడీ సూపర్ స్టార్ రేంజ్. వరసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతుంది.

ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు కొత్త హీరోలతో కూడా సినిమాలకు సై అంటున్న నయన్ అయితే సౌత్ లో సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయొచ్చని మేకర్స్ భావిస్తున్నారట. షారుఖ్ ఉంటే హిందీలో మార్కెట్ కు ఢోకా లేదు. దానికి నయన్ తోడైతే పాన్ ఇండియా సినిమాకు మంచి హైప్ వస్తుందని వారి ఆలోచనగా కనిపిస్తుంది. మరి ఇది కార్యరూపం దాల్చుతుందా లేక కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందా అన్నది చూడాల్సి ఉంది.