Tollywood : టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ పై హీరోల ఆసక్తి!
నాగార్జున కుబేర, కూలీ వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌తో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు

new trend in tollywood Heroes interest in negative shades of characters
నాగార్జున కుబేర, కూలీ వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌తో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కుబేరలో నాగార్జున పాత్ర, యాక్టింగ్ చూసి చిరు ఫిదా అయ్యారట. కుబేర సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్, ఓవర్సీస్ కలెక్షన్స్ చూస్తూ..చిరంజీవి ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి మరింత ఉత్సాహంగా ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మంచి దర్శకుడు, బలమైన కథ ఉంటే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయడానికి రెడీ అంటున్నారట చిరు.
టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు కొత్త ప్రయోగాలతో ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల విడుదలైన కుబేర మూవీలో నాగార్జున చేసిన సీబీఐ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నారు. నెగిటివ్ షేడ్స్‌తో నాగార్జున నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా నాగార్జున బాటలో నడవాలని ఆలోచిస్తున్నారని టాక్.
Dhanush : తిరుపతి రోడ్ల మీద రియల్ బిచ్చగాడిలా ‘ధనుష్’.. ఈ పాట విన్నారా? ఏడవటం ఖాయం..
కుబేరలో నాగార్జున పాత్ర చిరంజీవికి బాగా నచ్చిందట. మంచి కథ ఉంటే ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని ఆయన ఆసక్తి చూపిస్తున్నారట. కుబేర సినిమాలో నాగార్జున సీబీఐ ఆఫీసర్ దీపక్‌గా మంచి-చెడు మధ్య సంఘర్షణలో చిక్కుకున్న పాత్రలో అద్భుతంగా నటించారు.
ఈ పాత్రకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూసి చిరంజీవి ఇన్‌స్పైర్ అయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచి స్టోరీ ఉంటే, హీరో ఎవరైనా సరే, నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో నటించడానికి చిరు సిద్ధంగా ఉన్నారని టాక్. గతంలో చిరంజీవి కొన్ని చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలు చేసినప్పటికీ, పూర్తిస్థాయి నెగెటివ్ రోల్‌కు దూరంగా ఉన్నారు.
Laya : చూడ్డానికి చదువుకున్నవాడిలా ఉన్నాడు.. సినిమాల్లోకి ఎందుకు? త్రివిక్రమ్ గురించి లయ..
నాగార్జున స్టైల్‌లో సీరియస్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను చిరంజీవి ఎంచుకుంటే అది ఆడియన్స్‌కు ఫిదా చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నాగార్జున కుబేరలో చేసిన పాత్రకు..సామాజిక స్పృహతో కూడిన కథ ఎలా బలం చేకూర్చిందో చూసి, చిరంజీవి కూడా అలాంటి స్టోరీ కోసం వెతుకుతున్నారని సమాచారం.