నటి నవ్యకు కరోనా.. షూటింగులో పాల్గొన్న వారంతా క్వారంటైన్‌లో..

దేశంలో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా తెలుగు టీవీ నటి నవ్య స్వామి కరోనా బారిన పడింది. ఈవిషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
ఈ సందర్భంగా నవ్య స్వామి మాట్లాడుతూ.. ‘కరోనా పాజిటివ్ వచ్చినందుకు నేనేం సిగ్గు పడటంలేదు. ఈ విషయం గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని నాకు తెలుసు. దయచేసి రూమర్లు ఆపండి.. పాజిటివ్ వచ్చినంత మాత్రాన కంగారుపడాల్సిన అవసరం లేదు.
Stay Strond and Take it Easy.. వైరస్ అంతరించిపోయే వరకు జనాలకు దూరంగా ఉండండి.. దేవుడి దయవల్ల నేను బాగానే ఉన్నాను. త్వరలోనే తిరిగి మీ ముందుకొస్తాను’ అని వెల్లడించింది. నవ్య రెండు వారాల నుంచి టీవీ సీరియల్స్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నవ్యకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెతో పాటు షూటింగ్‌లో పాల్గొన్న వారందరికి పరీక్షలు చేశారు. ప్రస్తుతం వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
https://www.instagram.com/tv/CCGjd7UDwh2/?utm_source=ig_web_copy_link
Read:ముహూర్తం ఫిక్స్.. ఫలక్‌నుమాలో పెళ్లి..