NTR: సమ్మర్‌లో దిగుతున్న సింగమలై.. ఇక ఊచకోతే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌తో ఆడియెన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన ఈ స్టార్ హీరో, ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు తారక్, కొరటాల శివలు సిద్ధమవుతున్నారు.

NTR: సమ్మర్‌లో దిగుతున్న సింగమలై.. ఇక ఊచకోతే!

NTR Blockbuster Movie Simhadri To Re-Release

Updated On : January 17, 2023 / 6:16 PM IST

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌తో ఆడియెన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన ఈ స్టార్ హీరో, ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు తారక్, కొరటాల శివలు సిద్ధమవుతున్నారు.

NTR : తారక్‌తో ఇండియన్ క్రికెటర్లు.. వైరల్ అవుతున్న ఫొటో

అయితే ఈ మధ్యలోనే తారక్ తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. ఎన్టీఆర్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన ‘సింహాద్రి’ మూవీ తారక్‌కు ఎలాంటి ఫేం తీసుకొచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో తారక్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, నటవిశ్వరూపం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాను దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కాగా, ఇప్పుడు ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. సింహాద్రి చిత్రాన్ని తారక్ పుట్టినరోజు కానుకగా రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందట.

NTR : వెరైటీ మ్యాగజైన్ విలేకరికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన ఎన్టీఆర్..

ఎన్టీఆర్ పుట్టినరోజు మే నెలలో వస్తుండటంతో, సింహాద్రి సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద మరోసారి ఊచకోత ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాలో తారక్ సరసన అందాల భామలు భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించగా, ఎంఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. మరి తారక్ పుట్టినరోజు కానుకగా ‘సింహాద్రి’ చిత్రాన్ని నిజంగానే రీ-రిలీజ్ చేస్తారా లేదా అనేది అఫీషియల్‌గా అనౌన్స్ చేయాల్సి ఉంది.