Devara : కాలర్ ఎగరేసేలా దేవర ఉంటుంది.. అలాగే మూవీ కాన్సెప్ట్‌ని కూడా చెప్పేసిన ఎన్టీఆర్..

'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర మూవీ కాన్సెప్ట్‌ని చెప్పుకొచ్చారు. అలాగే మూవీ కాలర్ ఎగరేసేలా ఉంటుందని..

Devara : కాలర్ ఎగరేసేలా దేవర ఉంటుంది.. అలాగే మూవీ కాన్సెప్ట్‌ని కూడా చెప్పేసిన ఎన్టీఆర్..

NTR Interesting comments about Devara movie at Tillu Square success meet

Updated On : April 8, 2024 / 9:08 PM IST

Devara : ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ నెలలోనే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా.. షూటింగ్ లేట్ అవ్వడంతో అక్టోబర్ కి పోస్టుపోన్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ కొంచెం నిరుత్సాహ పడ్డారు. ఇక డీలా పడిన ఫ్యాన్స్ లో ఉత్సాహం కలిగించేలా ఎన్టీఆర్ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నేడు హైదరాబాద్ లో జరిగిన సిద్ధూ జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ మీట్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ దేవర గురించి మాట్లాడుతూ.. “ఈ సినిమా అంతా భయం అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. సినిమాలో ఎక్కువ శాతం భయం గురించే మాట్లాడుతూ ఉంటాము. అలాగే మీరు ఓవర్ అయ్యిందని అనుకోకపోతే సినిమా గురించి ఒక చిన్న మాట చెబుతాను. దేవర సినిమా రావడం కొంచెం లేట్ అయినా కాలర్ ఎగరేసేలా ఉంటుంది. అందుకోసం మేము ఎంతో కష్టపడుతున్నాము” అంటూ చెప్పుకొచ్చారు.

Also read : NTR : స్టేజి పై పవన్, ప్రభాస్ సినిమా డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్న ఎన్టీఆర్.. మీమ్స్ బాగా ఫాలో అవుతున్నాడుగా..

ఇక ఈ కామెంట్స్ తో అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా దేవర ఫస్ట్ పార్ట్ ని దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ని శరవేగంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. నిర్మాత కళ్యాణ్ రామ్ ఈ సినిమా విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటూ ప్రతిష్టాత్మకంగా మూవీని రూపొందిస్తున్నారు.