OG OST : గెట్ రెడీ ఫ్యాన్స్.. ఓజీ OST వచ్చేస్తుంది.. ఎప్పుడంటే.. వెరైటీగా ప్లాన్ చేస్తున్న తమన్..
సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యాక ఎప్పటికో OST వదులుతున్నారు. కానీ తమన్ మాత్రం త్వరగానే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాడు. (OG OST)

OG OST
OG OST : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే 252 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది ఈ సినిమా. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ కి పవన్ కళ్యాణ్ లుక్స్ తో పాటు మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. సినిమాలో సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.(OG OST)
పవన్ కి ఎలివేషన్స్ పడే సీన్స్ లో ఇచ్చిన మ్యూజిక్ అయితే వేరే లెవల్. దీంతో పవన్ ఫ్యాన్స్ ఓజీ సినిమా OST (Original Sound Track) అడుగుతున్నారు. ఆ OST వస్తే దాన్ని కట్ చేసుకొని ఫోన్ రింగ్ టోన్స్ గా పెట్టుకోడానికి రెడీగా ఉన్నారు ఫ్యాన్స్. సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యాక ఎప్పటికో OST వదులుతున్నారు. కానీ తమన్ మాత్రం త్వరగానే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాడు.
OG సక్సెస్ తర్వాత తమన్ వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. OST ని కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అక్టోబర్ లో దీపావళికి రిలీజ్ చేయడానికి చూస్తున్నాము. సుజీత్ తో మాట్లాడి దాన్ని కొత్తగా రిలీజ్ చేస్తాము. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎవ్వరూ చేయని విధంగా OST ని సీడీ రూపంలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. సుజీత్ తో మాట్లాడి కొత్తగా ప్లాన్ చేస్తాను అని తెలిపాడు.
దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓజీ సినిమా OST రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఓజీ సాంగ్స్ వైరల్ అవుతుంటే నెక్స్ట్ ఆ ఎలివేషన్ మ్యూజిక్స్, ముఖ్యంగా జానీ- తమ్ముడు రీమిక్స్ మ్యూజిక్ వైరల్ అవ్వడం ఖాయం అంటున్నారు.
The most awaited #OGOST will be out on This Diwali October 20th, Team is planned something new – @musicthaman#TheyCallHimOG pic.twitter.com/naB9HxFWVW
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) September 28, 2025
Also Read : Tik Tok Bhanu : టిక్ టాక్ భాను లవ్ స్టోరీ.. పదేళ్లు లవ్.. ఫస్ట్ అన్నయ్య అని పిలిచి.. పెళ్లి ఎప్పుడంటే..?