Pawan Kalyan : పవన్ అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్ ప్రోమో.. పవర్ స్ట్రోమ్ లోడింగ్!

బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షో సూపర్ సక్సెస్ గా నిలిచింది. తాజాగా ఈ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీసుకు వచ్చి సంచలనం సృష్టించారు. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.

Pawan Kalyan : పవన్ అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్ ప్రోమో.. పవర్ స్ట్రోమ్ లోడింగ్!

Pawan Kalyan unstoppable episode promo released

Updated On : January 14, 2023 / 7:12 AM IST

Pawan Kalyan : బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షో సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఆహాలో ప్రసారమవుతున్న ఈ షో సెకండ్ సీజన్ భారీ రీచ్ సంపాదించుకుంది. రెండో సీజన్ మొదలు పెట్టిన దగ్గర నుండి సినీ, రాజకీయ నాయకులోని పాపులర్ స్టార్స్ ని షోకి తీసుకు రావడం, ఆడియన్స్ కి తెలియని ఎన్నో విషయాలని బాలయ్య బయటపెట్టడంతో రెండు తెలుగు రాష్ట్రలో అన్ని వర్గాల ప్రజాధారణ పొందింది. తాజాగా ఈ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీసుకు వచ్చి సంచలనం సృష్టించారు. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.

Pawan Kalyan: ఆ విషయంపైనే చంద్రబాబు, నేను చర్చించాం: పవన్ కల్యాణ్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుండడం, బాలయ్య కూడా పవన్ కి సినీ, రాజకీయ పరంగా ప్రత్యర్థి కావడంతో ఈ షోపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆశక్తి నెలకుంది. ఇటీవల ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని గ్రాండ్ గా చేశారు మేకర్స్. ఇక ఈ ఎపిసోడ్ సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేస్తారు అనుకున్నారు అంతా, కానీ రిలీజ్ చేయలేదు. అయితే పండగ బహుమతిగా ఒక ప్రోమోని విడుదల చేశారు.

‘అన్‌స్టాపబుల్‌ లో పవర్ స్టార్ మానియా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. పవర్ స్ట్రోమ్ లోడింగ్’ అంటూ ఒక ఒక చిన్న ప్రోమో విడుదల చేసింది. అయితే ఈ ప్రోమోలో ఎపిసోడ్ కి సంబంధించిన విజువల్స్ ఏమి చూపించలేదు. కాగా ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల గురించి బాలకృష్ణ ప్రస్తావించినట్లు తెలుస్తుంది. పవన్ తో పాటు ఈ ఎపిసోడ్ లో త్రివిక్రమ్, సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొనున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫోన్ కాల్ ద్వారా పవన్ కళ్యాణ్ తో మళ్లాడినట్లు తెలుస్తుంది.