Game Changer : లోకల్ ఛానల్‌లో గేమ్ ఛేంజర్ పైరసీ.. నిందితుల అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ లోకల్ ఛానల్ ఈ ఫైరసీ కాపీని ప్రసారం చేసింది.

piracy of ram charan game changer movie local tv staff arrested
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 10న విడుదల చేశారు. అయితే.. ఈ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే ఫైరసీ బారిన పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చిత్ర బృందం వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ లోకల్ ఛానల్ ఈ ఫైరసీ కాపీని ప్రసారం చేసింది. దీనిపై చిత్ర నిర్మాతలు, టీమ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విశాఖపట్టణం కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాజువాక పోలీస్ అండ్ క్రైమ్ క్లూస్ టీమ్.. AP Local TV నిర్వాహకుడు చలపతిరాజుతో పాటు అతడి టీమ్‌ను అర్టెస్ట్ చేశారు. ఆ ఛానల్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తమ ప్రాంతంలో ఓ లోకల్ ఛానల్‌లో ప్రసారం చేస్తున్నారని తెలుపుతూ ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇందుకు సంబంధించిన స్ర్కీన్ షాట్‌లను కూడా షేర్ చేశాడు. దీనిపై సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వెనుక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉందన్నారు. పైరసీ కాపీని ప్రసారం చేయడం మంచి పద్దతి కాదని, దీని వల్ల ఎంతో మంది నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కియారా అద్వానీ కథానాయికగా నటించగా అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్యలు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే ఈ చిత్రం రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం తెలిపింది.
Thanks to @APPOLICE100 🙏❤️
For the swift action & hope more culprits will be caught soonఏపీ పోలీస్‌లు AP Local TVపై దాడి నిర్వహించారు, దీని ప్రతినిధి అప్పల రాజు #GameChanger తెలుగు సినిమా పైరసీ చేస్తున్నాడు. పోలీసులు అన్ని పరికరాలను స్వాధీనం చేసుకుని, కేసు (FIR 22/2025) నమోదు… https://t.co/X0NyO6Xws3 pic.twitter.com/uqSuDqglei
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 17, 2025