బొమ్మ పడదు : పీఎం నరేంద్ర మోడీ బయోపిక్ మే 19 తర్వాతే

‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాని చూడాలని అనుకుంటున్న వారు కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ చిత్రం ఇప్పట్లో రిలీజ్ కానట్టే ఉంది. సినిమా రిలీజ్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చిత్రం విడుదలపై CEC నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా విడుదలకు సీఈసీ బ్రేకులు వేసింది. దీనిపై చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Also Read : ట్వింకిల్ చేరబోయే పార్టీ ఇదే
ప్రధాని నరేంద్రమోడీ జీవితం ఆధారంగా వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో ‘పీఎం నరేంద్రమోడీ’ సినిమా రూపొందింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ సినిమాను రిలీజ్ చేయొద్దంటూ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు సినిమాను రిలీజ్ చేయవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్) ఆమోదం తెలిపిన తర్వాత విడుదలను ఎలా అడ్డుకుంటారని సినీ నిర్మాత సుప్రీంను ఆశ్రయించారు.
సుప్రీం ఆదేశాల మేరకు ఈసీ అధికారులు సినిమా చూసి నివేదిక సమర్పించారు. ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం పిటిషన్‌ను తిరస్కరించింది. ఎన్నికలు పూర్తయిన తర్వాతే సినిమా చూడొచ్చు. ఛాయ్ వాలా నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా.. ఆపై దేశప్రధానిగా నరేంద్ర మోడీ ఎలా ఎదిగాడు అనే వైనాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.
Also Read : వారణాశిలో నామినేషన్ వేసిన ప్రధాని